ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై ఇవాళ మరోసారి విచారణ

ఢిల్లీ లిక్కర్ పాలసీ( Delhi Liquor Policy ) ఈడీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై ఇవాళ మరోసారి విచారణ జరగనుంది.ఈ మేరకు మధ్యాహ్నం 2 గంటలకు రౌస్ అవెన్యూ కోర్టు( Rouse Avenue Court ) విచారణ చేపట్టనుంది.

 Another Hearing On Mlc Kavitha's Bail Petition Today,mlc Kavitha,delhi Liquor Sc-TeluguStop.com

గత విచారణలోనే కవితకు బెయిల్ ఇస్తే కేసు దర్యాప్తు ప్రభావితం అయ్యే అవకాశం ఉందని ఈడీ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు.సాక్షులను, ఆధారాలను కవిత తారుమారు చేసే అవకాశం ఉందని వాదనలు వినిపించారు.

అదేవిధంగా కేసులో కవితను అరెస్ట్( Kavitha Arrest ) చేయొద్దని సుప్రీంకోర్టు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని న్యాయస్థానానికి ఈడీ( ED ) తెలిపింది.సెక్షన్ 19 ప్రకారం తమకు అరెస్ట్ చేసే అధికారం ఉందని పేర్కొంది.

ఈ క్రమంలోనే అరెస్ట్ ప్రక్రియ అంతా చట్టబద్ధంగానే జరిగిందని ఈడీ వెల్లడించింది.ట్రాన్సిట్ రిమాండ్ లో ఎటువంటి ఉల్లంఘన జరగలేదని ఈడీ పేర్కొంది.

ఈ క్రమంలోనే తదుపరి విచారణను రౌస్ అవెన్యూ కోర్టు ఇవాళ్టికి వాయిదా వేసింది.నేటి విచారణలో ఈడీ వాదనలు పూర్తయ్యే ఛాన్స్ ఉంది.

అనంతరం కవిత తరపు న్యాయవాది కౌంటర్ వాదనలు వినిపించనున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube