ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై ఇవాళ మరోసారి విచారణ

ఢిల్లీ లిక్కర్ పాలసీ( Delhi Liquor Policy ) ఈడీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై ఇవాళ మరోసారి విచారణ జరగనుంది.

ఈ మేరకు మధ్యాహ్నం 2 గంటలకు రౌస్ అవెన్యూ కోర్టు( Rouse Avenue Court ) విచారణ చేపట్టనుంది.

గత విచారణలోనే కవితకు బెయిల్ ఇస్తే కేసు దర్యాప్తు ప్రభావితం అయ్యే అవకాశం ఉందని ఈడీ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు.

సాక్షులను, ఆధారాలను కవిత తారుమారు చేసే అవకాశం ఉందని వాదనలు వినిపించారు.అదేవిధంగా కేసులో కవితను అరెస్ట్( Kavitha Arrest ) చేయొద్దని సుప్రీంకోర్టు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని న్యాయస్థానానికి ఈడీ( ED ) తెలిపింది.

సెక్షన్ 19 ప్రకారం తమకు అరెస్ట్ చేసే అధికారం ఉందని పేర్కొంది.ఈ క్రమంలోనే అరెస్ట్ ప్రక్రియ అంతా చట్టబద్ధంగానే జరిగిందని ఈడీ వెల్లడించింది.

ట్రాన్సిట్ రిమాండ్ లో ఎటువంటి ఉల్లంఘన జరగలేదని ఈడీ పేర్కొంది.ఈ క్రమంలోనే తదుపరి విచారణను రౌస్ అవెన్యూ కోర్టు ఇవాళ్టికి వాయిదా వేసింది.

నేటి విచారణలో ఈడీ వాదనలు పూర్తయ్యే ఛాన్స్ ఉంది.అనంతరం కవిత తరపు న్యాయవాది కౌంటర్ వాదనలు వినిపించనున్నారు.

వీడియో: ఈ చిన్నారి ఎంత డ్రామా చేస్తుందో చూస్తే నవ్వాపుకోలేరు..