గూగుల్ పిక్సెల్ 8a స్మార్ట్ ఫోన్ డిజైన్, ఫీచర్లు లీక్.. లాంచింగ్ ఎప్పుడంటే..?

గూగుల్ పిక్సెల్ 8a స్మార్ట్ ఫోన్ గూగుల్ I/O 2024 ఈవెంట్ లో లాంఛ్ చేయబడుతుంది.ఈ హ్యాండ్ సెట్ మొత్తం నాలుగు రంగుల ఎంపికలలో వస్తుంది.

నివేదిక ప్రకారం లీక్ అయిన ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్ వివరాలకు గురించి తెలుసుకుందాం.

గూగుల్ పిక్సెల్ 8a స్మార్ట్ ఫోన్:( Google Pixel 8a Smartphone ) ఈ ఫోన్ 6.1 అంగుళాల HD+OLED డిస్ ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 1400 నిట్స్ గరిష్ఠ HDR బ్రైట్ నెస్ తో వస్తోంది.ఈ ఫోన్ 8GB RAM తో పాటు పిక్సెల్ 8, పిక్సెల్ 8 ప్రో కు శక్తి ఇచ్చే అదే గూగుల్ యొక్క టెన్సర్ G3 చిప్ తో వస్తుంది.

5000mAh బ్యాటరీ ( 5000mAh battery )సామర్థ్యం కలిగి 27W వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ కు సపోర్ట్ చేస్తుంది.ఇక కెమెరా విషయానికి వస్తే.పిక్సెల్ 8a కూడా పిక్సెల్ 7a వలె అదే కెమెరా కాన్ఫిగరేషన్ తో ఉంటుంది.64 మెగాపిక్సల్ ప్రైమరీ కెమెరా, 13 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా తో ఉంటుంది.

ఈ ఫోన్ డిజైన్ విషయానికి వస్తే.ఈ ఫోన్ యొక్క వెనుక ప్యానెల్ పిక్సెల్ ఎయిట్ మాదిరిగానే వెనుక కెమెరా మాడ్యూల్ కలిగి ఉంటుంది.ఈ ఫోన్ వెనుక ప్యానెల్ మాట్టే ఫినిష్ ను కలిగి ఉంటుంది.ఈ స్మార్ట్ ఫోన్ ధరను కంపెనీ ఇంకా వెల్లడించలేదు.లీక్ అయిన నివేదిక ప్రకారం ఈ ఫోన్ బే బ్లూ, మింట్ గ్రీన్, అబ్సిడియన్ బ్లాక్, పింగాణి వైట్ రంగుల్లో వస్తుంది.మే 14న ప్రారంభమయ్యే గూగుల్ I/O 2024 లో ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ అవ్వనుంది.

అప్పుడు ఈ స్మార్ట్ ఫోన్ కు సంబంధించిన అన్ని వివరాలను కంపెనీ వెల్లడించనుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube