ముఖ్యంగా చెప్పాలంటే ఉదయం నిద్ర లేచి బాల్కనీలో కూర్చుని కాఫీ( Coffee ) తాగుతూ ఉంటే ఆ మజా అలా చేసిన వారికి మాత్రమే తెలుస్తుంది.ప్రతి రోజు కూడా ఎంతో తాజాగా మొదలవుతుంది.
చాలామందికి కాఫీ అంటే ఎంతో ఇష్టం.కాఫీ ఒక్కరోజు లేకపోతే ఆ రోజు ఏదో తెలియని బాధగా ఉంటుంది.
కొందరైతే రోజుకు నాలుగు నుంచి ఐదు కప్పులు కాఫీ తాగుతూ ఉంటారు.కాఫీ మితంగా తాగడం ఆరోగ్యానికి మంచిదే.
ఇది ఒత్తిడిని( Stress ) కూడా దూరం చేస్తుంది.ఆందోళనను దూరం చేస్తుంది.
కాఫీలో కొబ్బరి నూనెను వేసుకొని తాగడం గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? దీన్ని బుల్లెట్ కాఫీ అని పిలుస్తారు.కాఫీలో కొబ్బరినూనె ఏంట్రా అని మీకు ఆశ్చర్యంగా అనిపించవచ్చు.
కానీ దీని వల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి.

మీ కాఫీ ని మరింత హెల్తిగా చేసే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.ముఖ్యంగా చెప్పాలంటే ప్రతి రోజు ఉదయం సమయంలో ఒక కప్పు కాఫీలో రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనెను( Cancer ) కలుపుకొని తాగడం వల్ల శరీరానికి రెట్టింపు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.ఇందులో ఉండే ఆంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్, గుండె జబ్బులు ఇతర ప్రమాదకరమైన వ్యాధులు రాకుండా ఉపశమనన్ని కలిగిస్తాయి.
అంతేకాకుండా కాఫీ కొబ్బరినూనె మిక్స్ చేసుకొని తాగడం వల్ల శరీరంలో రోగనిరొదక శక్తి( Immunity ) మెరుగుపడుతుంది.దీంతో పాటు బ్యాక్టీరియా కూడా సులభంగా నశిస్తుందని చెబుతున్నారు.

కాఫీలో కొబ్బరి నూనె కలిపి తాగడం వల్ల మెదడు మెరుగుపడుతుంది.దీని కారణంగా ఏకగ్రత పెరిగి దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా ఉంటారని నిపుణులు చెబుతున్నారు.అంతేకాకుండా మెదడులోని నరాలను దృఢంగా ఉంచేందుకు కూడా ఎంతగానో ఉపయోగపడతాయి.తరచుగా జీర్ణక్రియ సమస్యలతో బాధపడుతున్న వారు కాఫీ కొబ్బరినూనె కలిపి తీసుకుంటే మలబద్దకం సమస్య పూర్తిగా దూరమవుతుంది.
ఇందులో ఉండే గుణాలు డయాబెటిస్( Diabetes ) తో బాధపడుతున్న వారికి కూడా ప్రభావంతంగా పనిచేస్తాయి.రక్తంలో చక్కెర పరిమాణాలను నియంత్రించేందుకు ఇతర దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా శరీరాన్ని రక్షించేందుకు కీలకపాత్ర పోషిస్తాయి.
అంతేకాకుండా డిప్రెషన్ ను తగ్గించి మానసిక స్థితిని మెరుగుపరిచేందుకు కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు.వంటకాల కోసం ఉపయోగించే కొబ్బరి నూనెను మాత్రమే ఉపయోగించాలని కూడా చెబుతున్నారు.







