ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ( CM Jagan Mohan Reddy ) పై గుర్తు తెలియని వ్యక్తులు రాయితో దాడి చేయడంతో ఆయన కన్నుపై భాగంలో గాయమై కుట్లు పడిన సంగతి మనకు తెలిసిందే.ఇలా ముఖ్యమంత్రి పై ఇలాంటి దాడికి పాల్పడినటువంటి వారిపట్ల ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ దర్యాప్తు ప్రారంభించారు.
ఇలాంటి తరుణంలోనే రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా తీవ్రస్థాయిలో ఆందోళన వ్యక్తం చేశారు.అయితే జగన్మోహన్ రెడ్డి గారికి పెద్దగా ప్రమాదం లేకపోవడంతో సంతోషం వ్యక్తం చేశారు కానీ ఈ విషయం గురించి నటి శ్రీ రెడ్డి ( Sri Reddy ) సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోని షేర్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
జగన్ పై జరిగినటువంటి దాడిని ఖండిస్తూ ఈమె ఆందోళన వ్యక్తం చేయడమే కాకుండా ఇలాంటి దాడికి పాల్పడిన వారి పట్ల కఠినంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఎన్నో కోట్ల మందికి ప్రాణమైనటువంటి వ్యక్తిపై ఇలా హత్యాయత్నం చేస్తారా? మీరు అసలు మనుషులేనా ఒక వ్యక్తికి హాని తలపెట్టి అంత కోపమా చాలామంది జనాలు రావడం చూసి ఓర్వలేక పోతున్నారు అంటూ మండిపడ్డారు.జగనన్న కోసం ఎన్ని ప్రాణాలు బ్రతుకుతున్నాయో తెలుసా ఆయన ఈ రాష్ట్రానికి ఎంత ముఖ్యమో తెలుసా? మేమంతా ఆయన పైనే ప్రాణాలు పెట్టుకుని బ్రతుకుతున్నాము.
నేను చచ్చిపోతాను జగనన్న మీరంటే ప్రాణం మాకు ఇలాంటి ఘటన జరిగిందని తెలిసి రాత్రంతా కూడా నిద్ర పట్టలేదు అంటూ శ్రీ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పై జరిగినటువంటి దాడి గురించి ఎమోషనల్ అవడమే కాకుండా ఈ ఘటన వెనుక బోండా ఉమా ఉన్నారని అనుమానాలను వ్యక్తం కూడా చేశారు.ఏది ఏమైనా జగన్ పై జరిగినటువంటి దాడిని( Attack on YS Jagan ) ఖండిస్తూ రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు కూడా చేస్తున్నారు.