స్మార్ట్‌ఫోన్ వ్యసనం ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఒక ప్రధాన సమస్య.చాలా మంది తమ ఫోన్‌లలో ఎక్కువ సమయం గడుపుతున్నారు, చుట్టూ ఉన్న ప్రపంచాన్ని పట్టించుకోవడం లేదు.
ఈ కారణంగా చాలా బాధాకరమైన సంఘటనలు జరుగుతున్నాయి.తాజాగా మొబైల్ అడిక్షన్( Mobile Addiction ) ఎంత ప్రమాదకరమైనదో చూపించే స్టేజ్డ్ వీడియో ఒక వైరల్‌గా మారింది.
ఈ వీడియోలో ఒక మహిళ తన చిన్న పిల్లవాడు( Toddler ) నేలపై పడుకుని ఆడుతున్నప్పుడు ఫోన్ కాల్‌లో మునిగిపోతుంది.ఆమె కూరగాయలు కోస్తున్నప్పుడు కూడా పట్టించుకోదు.
ఫోన్ ధ్యాసలో కంప్లీట్‌గా మునిగిపోయి ఏం జరిగిందో తెలియని స్థితిలో పిల్లవాడిని రిఫ్రిజిరేటర్( Refrigirator ) లోపల ఉంచి తలుపు మూసివేస్తుంది.సీసీటీవీ కెమెరాలో రికార్డయిన ఈ వీడియోలో ఆమె తన పనిని కొనసాగిస్తున్నట్లు చూపిస్తుంది.
కొంత సమయం తరువాత, ఆమె భర్త బిడ్డ కనిపించడం లేదని గమనించి, ఫ్రిజ్ నుండి శబ్దాలు విని బిడ్డను రక్షిస్తాడు.ఎక్స్ ప్లాట్‌ఫామ్ (గతంలో ట్విట్టర్)లో షేర్ చేసిన ఈ వీడియో 3.9 లక్షల వ్యూస్ వచ్చాయి.చాలా మంది వీక్షకులు ఈ ఘటన చాలా బాధాకరమైనది అని, తల్లిదండ్రులు( Parents ) తమ పిల్లలకు స్మార్ట్‌ఫోన్ల కంటే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని అభిప్రాయపడ్డారు.
అయితే, కొందరు ఈ వీడియో నిజమా లేదంటే ఫేక్ హా అని ప్రశ్నించారు.
2023 జులైలో కూడా స్మార్ట్ ఫోన్ అడిక్షన్ ఎంత ప్రమాదకరమో ఒక వీడియో వైరల్‌గా మారింది.అందులో ఒక మహిళ ఎస్కలేటర్‌పై( Escalator ) నిలబడి ఉంది.ఎస్కలేటర్ పనిచేయడం లేదు, కానీ ఆమె గమనించలేదు.
ఆమె ఫోన్‌లో మునిగిపోయి, ఎక్కడికి వెళ్ళాలో తెలియని స్థితిలో ఉంది.చుట్టూ ఉన్న ప్రజలు ఆమెను దాటి వెళ్ళినప్పటికీ, ఎవరూ ఆమెకు ఎస్కలేటర్ పనిచేయడం లేదని చెప్పలేదు.
ఈ వీడియో చాలా మందిని ఆలోచింపజేసింది.స్మార్ట్‌ఫోన్‌ల వల్ల మనం చుట్టూ ఉన్న ప్రపంచాన్ని పట్టించుకోవడం మానేస్తున్నాం.డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా ఫోన్లలో మునిగిపోవడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి.ఈ వీడియోలు మనకు ఒక హెచ్చరిక.స్మార్ట్‌ఫోన్లు మంచివి, కానీ వాటి వల్ల మన జీవితాలు నాశనం కాకూడదు.మనం మన పరిసరాల గురించి తెలుసుకోవాలి, మన చుట్టూ ఉన్న వ్యక్తులతో మాట్లాడాలి.