రోజూ ఉద‌యం వాట‌ర్ లో ఇవి క‌లిసి తాగారంటే బ‌రువు త‌గ్గి స్లిమ్‌గా మార‌తారు!

అధిక బరువు( Overweight ) అనేది ఇటీవల కాలంలో వయసుతో సంబంధం లేకుండా కోట్లాది మందికి అతిపెద్ద సమస్యగా మారింది.ప్రతి ఏడాది అధిక బరువుతో బాధపడుతున్న బాధితులు భారీగా పెరిగిపోతున్నారు.

 If You Drink These Together In Water, You Will Lose Weight! Weight Loss, Weight-TeluguStop.com

శరీరం బరువు అదుపు తప్పడానికి అనేక కారణాలు ఉన్నాయి.అయితే బరువు తగ్గడానికి కూడా ఎన్నో మార్గాలు ఉన్నాయి.

కాస్త శ్రద్ధ పడితే ఎంత బరువు ఉన్నా కూడా తగ్గొచ్చు.ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే డ్రింక్ వెయిట్ లాస్ కు చాలా బాగా సహాయపడుతుంది.

ఈ డ్రింక్ ను రెగ్యులర్ డైట్ లో కనుక చేర్చుకుంటే ఎంత లావుగా ఉన్న వారైనా సరే స్లిమ్ గా మారడం ఖాయం.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ డ్రింక్ ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

Telugu Amla Powder, Tips, Latest, Moringa Powder-Telugu Health

ముందుగా ఒక గ్లాసు హాట్ వాటర్ తీసుకోండి.ఈ వాటర్ లో హాఫ్ టేబుల్ స్పూన్ ఉసిరికాయ పొడి, హాఫ్ టేబుల్ స్పూన్ మునగాకు పొడి వేసుకొని బాగా కలిపి మూత పెట్టి ఐదు నిమిషాల పాటు వదిలేయండి.ఆ తర్వాత వాటర్ ను నేరుగా సేవించండి.ప్రతిరోజు ఉదయాన్నే ఈ విధంగా చేశారంటే అద్భుత ఫలితాలను పొందుతారు.మున‌గాకు పొడిలో మెథియోనిన్ ఉంటుంది.ఇది కొవ్వును గ్రహించి, కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది.

తద్వారా బాడీలో అద‌న‌పు కొవ్వు క్ర‌మంగా క‌రిగిపోతుంది.మున‌గాకు పొడి జీవక్రియను సైతం పెంచుతుంది.

ఇది బ‌రువు త‌గ్గ‌డాన్ని ప్రోత్స‌హిస్తుంది.

Telugu Amla Powder, Tips, Latest, Moringa Powder-Telugu Health

అలాగే ఉసిరి పొడి( Amla powder ) వెయిట్ లాస్ కు తోడ్ప‌డ‌ట‌మే కాకుండా మొత్తం ఆరోగ్యాన్ని కూడా ప్రోత్సహిస్తుంది.శరీరాన్ని నిర్విషీకరణ చేయడంలో, జీర్ణక్రియను పెంచడంలో, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో మరియు జీవక్రియ మెరుగుప‌ర‌చ‌డంలో ఉసిరి పొడి స‌హాయ‌ప‌డుతుంది.ఉసిరి పొడితో మీరు మీ బ‌రువు త‌గ్గించే లక్ష్యాలను త్వ‌ర‌గా చేరుకోవ‌చ్చు.

కాబ‌ట్టి ఎవ‌రైతే అధిక బ‌రువుతో బాధ‌ప‌డుతున్నారో వారు త‌ప్ప‌కుండా ప్ర‌తిరోజూ ఉద‌యాన్నే వాట‌ర్ లో మున‌గాకు పొడి, ఉసిరి పొడి క‌లిపి తీసుకోండి.ఇలా చేయ‌డం ద్వారా బెస్ట్ రిజ‌ల్డ్ మీసొంతం అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube