కరీంనగర్ లో మాజీ మంత్రి కేటీఆర్( KTR ) కీలక వ్యాఖ్యలు చేశారు.బీఆర్ఎస్ కార్పొరేటర్లతో భేటీ అయిన కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం( Congress Government )పై విమర్శలు చేశారు.
రాష్ట్రంలో మున్ముందు ఏమైనా జరగొచ్చని కేటీఆర్ అన్నారు.అక్రమ కేసులు, అరెస్టులతో ప్రభుత్వం వేధించే ఛాన్స్ ఉందన్నారు.
ఈ క్రమంలోనే ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటాయని పేర్కొన్నారు.ఓటమి వలన బాధపడొద్దని ధైర్యం చెప్పారు.
కేసులకు ఎవరూ భయపడొద్దని, అన్నింటిని ధైర్యంగా ఎదుర్కొందామని సూచించారు.అయితే రాష్ట్రంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్( BRS ) ఓటమి పాలైన సంగతి తెలిసిందే.