తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది డైరెక్టర్లు( Directors ) వాళ్ళకంటూ ప్రత్యేకతను ఏర్పాటు చేసుకున్నారు ఇక అందులో భాగంగానే ఒక్కో డైరెక్టర్ కి ఒక్కో స్టైల్ ఉంటుంది.కాబట్టి ఆ స్టైల్ లో వాళ్ళు చాలా బాగా ఇమిడిపోయి సినిమాలు చేస్తూ ఉంటారు.
ఇక ఇలాంటి క్రమంలో హను రాఘవ పూడి( Hanu Raghava Pudi ) ది మరోక స్టైల్ ఈయన ప్యూర్ లవ్ స్టోరీ లు తెరకెక్కిస్తాడు అందులో సక్సెస్ లు కొడుతూనే మంచి డైరెక్టర్ గా గుర్తింపు పొందుతున్నాడు.
ఇక రీసెంట్ గా ఈయన తీసిన సీతా రామం సినిమా( Sita Ram movie ) మంచి విజయాన్ని అందుకోవడంతో పాటు డైరెక్టర్ గా కూడా ఆయనకు మంచి పేరు అయితే సంపాదించి పెట్టింది.ఇక ఇప్పుడు ఈయన ప్రభాస్( Prabhas ) తో ఒక లవ్ స్టోరీ చేస్తున్నట్టు గా తెలుస్తుంది.అయితే ఈ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుంది అనేది తెలియదు కానీ మొత్తానికైతే ఈయన ప్రభాస్ తో సినిమా చేయాలని చూస్తున్నాడు.
ఇక అందులో భాగంగానే హను రాఘవ పూడి ప్రభాస్ కి కథ కూడా వినిపించినట్టు గా వార్తలు అయితే వస్తున్నాయి.మరి ఈ సినిమా ఎప్పుడు సెట్స్ మీదికి వెళుతుంది అనేది ఇప్పుడు చాలా చర్చనీయాంశంగా మారింది.
నిజానికి ఈ సినిమా కనక వర్కవుట్ అయితే ఇది ప్యూర్ లవ్ స్టోరీ గా తెరకెక్కుతుంది కాబట్టి ప్రభాస్ ఈ సినిమాలో ఎలా కనిపిస్తాడు అనేది కూడా తెలియాల్సి ఉంది.అయితే రాధే శ్యామ్( Radhe Shyam ) సినిమాలో లవర్ బాయ్ క్యారెక్టర్ లో ప్రభాస్ అసలు సెట్ అవ్వలేదు మరి ఈ సినిమాకి ఎలా సెట్ అవుతాడో వేచి చూడాలి…నిజానికి ఈ సినిమా సెట్స్ మీద కి రావాలంటే మరో రెండు సంవత్సరాలు పట్టే అవకాశాలు అయితే ఉన్నాయి.