రెండో షెడ్యూల్‌ కి కూడా జాయిన్‌ అవ్వని 'విశ్వంభర'

మెగా స్టార్‌ చిరంజీవి( Chiranjeevi ) హీరో గా బింబిసార చిత్ర దర్శకుడు వశిష్ఠ దర్శకత్వం లో యూవీ క్రియేషన్స్‌ వారు నిర్మిస్తున్న చిత్రం ‘విశ్వంభర’.ఇప్పటికే ఒక షెడ్యూల్‌ ను ముగించిన దర్శకుడు వశిష్ఠ( Mallidi Vasishta ) రెండో షెడ్యూల్‌ కి రెడీ అవుతున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి.

 Chiranjeevi Vishwambara Movie Shooting Update , Chiranjeevi , Social Media, Vis-TeluguStop.com

డిసెంబర్‌ లోనే సినిమా రెండో షెడ్యూల్‌ షూటింగ్‌ ను ప్రారంభించే విధంగా ప్లాన్‌ చేస్తున్నారు.భారీ ఎత్తున సినిమాకు సంబంధించిన సెట్స్ నిర్మాణం జరుగుతోంది.

ఇది ఒక సోషియో ఫాంటసీ సినిమా అంటూ ఇప్పటికే వార్తలు వస్తున్నాయి.చకచక రెండో షెడ్యూల్‌ కూడా జరుగుతోంది.

సినిమా వచ్చే ఏడాది సమ్మర్‌ లో వస్తుందా అంటూ కొందరు ఆసక్తిగా చూస్తూ ఉండవచ్చు.అసలు విషయం ఏంటి అంటే మొదటి షెడ్యూల్‌ లో కొన్ని కారణాల వల్ల చిరంజీవి పాల్గొనలేదు.

Telugu Chiranjeevi, Telugu, Tollywood, Uv, Vashista, Vishwambara-Movie

ఆయన లేకుండా ఉండే సన్నివేశాల చిత్రీకరణ జరిపారు.ఈ నెల చివర్లో లేదా వచ్చే నెలలో సినిమా షూటింగ్‌ లో చిరంజీవి జాయిన్‌ అవుతాడు అనుకున్నారు.దాంతో రెండో షెడ్యూల్‌ కి చిరు జాయిన్ అవ్వడం ఖాయం అనుకున్నారు.కానీ అనూహ్య పరిణామాల నేపథ్యం లో రెండో షెడ్యూల్‌ ను కూడా దర్శకుడు వశిష్ఠ హీరో లేకుండా చేసేందుకు రెడీ అయ్యాడు అంటూ వార్తలు వస్తున్నాయి.

Telugu Chiranjeevi, Telugu, Tollywood, Uv, Vashista, Vishwambara-Movie

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం మూడో షెడ్యూల్‌ నుంచి చిరంజీవి జాయిన్‌ అయ్యే అవకాశాలు ఉన్నాయి.అదే కనుక నిజం అయితే వచ్చే నెల మొత్తం విశ్వంభర షూటింగ్‌ జరిగినా కూడా చిరంజీవి సెట్స్ కి వచ్చే అవకాశం లేదు అని తేలిపోయింది.ఈ సినిమా కు సంబంధించిన విషయాల పట్ల దర్శకుడు క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.త్వరలోనే సినిమా కోసం హీరోయిన్ ను ఫిక్స్ చేసేందుకు చర్చలు జరుగుతున్నాయి.కనుక కొత్త ఏడాదికి హీరోయిన్ ప్రకటన ఉండే అవకాశం ఉంది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube