హైదరాబాద్ లో క్రైం రేటు పెరిగిందని నగర సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి అన్నారు.వార్షిక నేర నివేదికను విడుదల చేసిన ఆయన మాట్లాడుతూ గతంతో పోల్చితే రెండు శాతం కేసులు పెరిగాయని తెలిపారు.
రాష్ట్రంలో ఎన్నికల సీజన్ కారణంగా కేసులు పెరిగాయని సీపీ శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.9 శాతం దోపిడీలు, మహిళలపై 12 శాతం నేరాలు పెరిగాయన్నారు.గత సంవత్సరంతో పోలిస్తే చిన్నారులపై 12 శాతం నేరాలు తగ్గాయన్నారు.ఈ ఏడాది 63 శాతం మంది నేరస్తులకు శిక్ష పడిందని పేర్కొన్నారు.13 కేసులో 13 మందికి జీవిత ఖైదు శిక్ష పడిందన్నారు.హైదరాబాద్ లో మొత్తం 24,821 కేసులు నమోదు అయ్యాయన్న సీపీ 79 హత్యలు, 403 రేప్ కేసులతో పాటు 242 కిడ్నాప్ కేసులు నమోదు అయ్యాయని చెప్పారు.
అలాగే న్యూ ఇయర్ వేడుకలను 31 వ తేదీ అర్థరాత్రి ఒంటిగంటకు ముగించాలని తెలిపారు.ఈ క్రమంలోనే నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని స్పష్టం చేశారు.