అర్జెంటుగా ఒక హిట్ కావాలి.ప్రభాస్(Prabhas ) నిలబెట్టే సినిమా కావాలి.
బాహుబలి తర్వాత చెప్పుకోదగ్గ సినిమాలేమీ లేవు.సాహో కొంతమేర పరవాలేదు అనిపించినా రాధే శ్యామ్ భయంకరం.
ఇక ఆది పురుష అరాచకం.వీటన్నిటి నుంచి బయటపడి తనను తాను కాపాడుకోవాలంటే ప్రభాస్ కి పునర్జన్మ కావాలి.
అతిపెద్ద రిలీఫ్ ఇప్పుడు సలార్ సినిమాతో రానే వచ్చింది.చాలా ఏళ్లుగా దూరం అయినా విజయం ప్రభాస్ కి ఇప్పుడు దక్కింది.
సలార్ అత్యంత గొప్ప సినిమా అని చెప్పను కానీ ఇప్పుడు కొత్తగా నడుస్తున్న ట్రెండ్ కు తగ్గట్టుగానే ఉంది.పఠాన్, జవాన్ సినిమా లాగానే బాలీవుడ్ ప్రేక్షకులు, టాలీవుడ్ ప్రేక్షకులు అందరూ మెచ్చే సినిమా గానే దడదడ మోగించేస్తోంది.
ప్రభాస్ ఫ్యాన్స్ అంతా కూడా ప్రస్తుతం హ్యాపీగా ఫీల్ అవుతున్నారు.ప్రభాస్ సినిమా కథల ఎంపికలో తప్పులు చేస్తూ రావడం వల్లే ప్లాప్స్ అతనికి ఎక్కువగా దక్కాయి అని అనుకోవచ్చు.ఆకలి మీద ఉన్న ఫ్యాన్స్ కి ఇప్పుడు మంచి విందు భోజనం దొరికినట్టుగా ఉంది.అయితే సినిమాలో కామెడీ పెద్దగా ఉండదు.అలాగని హీరోయిన్స్ తో పిచ్చి గంతులు ఉండవు.పట్టు కదలకుండా కథపై కమాండ్ పోకుండా కేజిఎఫ్ 3 లాంటి ఒక సినిమా తీశాడు ప్రశాంత్ నీల్( Prashanth Neel ).అయితే కేజిఎఫ్ మొదటి రెండు భాగాల్లో అయితే ప్రభాస్ ఇప్పుడు మూడో భాగానికి హీరో అన్నట్టుగానే ఈ సినిమా ఉంటుంది.
ఇది ఇంతకు ముందే ప్రశాంత్ చెప్పినట్టుగా ఉగ్రం మరియు కేజిఎఫ్ సినిమాలకు ఒక హైబ్రిడ్ వర్షన్ లాంటి సినిమా.మంచి యాక్షన్ మూవీ అలాగే నెత్తుటి బీభత్సం అనేది వెరీ కామన్.ప్రశాంత్ అంటే అంతే కదా.సినిమాలోని మిగతా నటీనటులంతా తేలిపోయిన ప్రభాస్ ఒక్కడే సినిమాని పూర్తిగా గట్టెక్కించేసాడు.పృథ్వీ రాజ్, జగపతి బాబు, శృతి హాసన్ కన్నా కూడా తల్లిగా ఈశ్వరి రావు( Easwari Rao ) పాత్ర చాలా బాగుంటుంది.
ఇక ఈ సినిమాతో డంకి సినిమాకు పోటీ లేదని చెప్పుకోవాలి.ఎప్పుడు ఇక్కడ చూసిన సెలబ్రేషన్స్ మూడ్ కనిపిస్తోంది.