మహిళలకు ఫ్రీ బస్సు పథకం తెచ్చిన కొట్లాట

సూర్యాపేట జిల్లా:తెలంగాణా ప్రభుత్వం తెచ్చిన మహిళలకు ఫ్రీ బస్సు( Free bus for women ) పథకం డ్రైవర్ ప్రయాణికుల మధ్య రచ్చకు దారితీసింది.వివరాల్లోకి వెళితే…కోదాడ నుండి సూర్యాపేట( Suryapet )కు వెళుతున్న పల్లె వెలుగు బస్సు మునగాల మండలం మాధవరం గ్రామంలోని నేలమర్రి స్టేజి వద్ద ఆగకుండా వెళుతుండగా అడ్డుకున్న ప్రయాణికులు డ్రైవర్ తో గొడవకు దిగారు.

 Free Bus Scheme For Women Brought A Fight , Free Bus For Women, Suryapet ,tsrtc-TeluguStop.com

ఇంతమంది ప్రయాణికులు బస్సు కోసం ఎదురు చూస్తున్నా బస్సు ఆపకుండా పోవడం ఏమిటని డ్రైవర్ పై ఆగ్రహం వ్యక్తం చేయగా, కెపాసిటీకి మించి ఎక్కారని ఎలా ఆపాలని డ్రైవర్ చెబుతున్నా వినకుండా దాడికి యత్నించడంతో ఇరువురి మధ్య తోపులాట జరిగింది.విషయం తెలుసుకున్న పోలీసులు రంగప్రవేశం చేసి అందరికీ సర్ది చెప్పి పంపించడంతో గొడవ సద్దుమణిగింది.

బస్సు డ్రైవర్ మాట్లడుతూ 50 మంది కెపాసిటీ గల బస్సులో 130 మందిని ఎక్కించుకున్నామని, దీనితో బస్సు ఓవర్ లోడ్ అయిందని ఇంకా ఎలా ఎక్కుతారని అన్నారు.మహిళలకు ఫ్రీ బస్సు పథకంతో ఇలాంటి ఘటనలు ఇక ముందు కూడా జరుగుతూనే ఉంటాయని ప్రయాణికులు,స్థానికులు మాట్లాడుకోవడం గమనార్హం.

ఇదిలా ఉంటే పల్లె వెలుగు బస్సుల కోసం ముందు స్టేజీలో ప్రయాణికులు పడిగాపులు గాయడం కొసమెరుపు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube