Sreeleela: చెప్పులేసుకొని స్వామి పక్కన ఆ డాన్స్ ఏంటి… శ్రీ లీల పై ట్రోల్స్ చేస్తున్న నేటిజన్స్?

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ ఎవరు అంటే అందరూ కూడా టక్కున శ్రీ లీల (Sreeleela) పేరు చెబుతారు.శ్రీ లీల ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.

 Netizens Trolls On Sreeleela Dance With Nithin-TeluguStop.com

ఇలా వరుస సినిమాలలో నటించడమే కాకుండా ఈమె నటించిన సినిమాలు ప్రతినెల ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి.నవంబర్ 24వ తేదీ ఆదికేశవ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి ఈమె ఈ సినిమా ద్వారా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

ఈ క్రమంలోనే డిసెంబర్ 8వ తేదీ ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ (Extra Ordinary Man) సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఈ సినిమా వక్కంతం వంశీ దర్శకత్వంలో నితిన్ (Nithin) హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది చాలా రోజుల తర్వాత వంశీ నితిన్ హిట్ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.ఈ క్రమంలోనే ఈ సినిమాకు మంచి సక్సెస్ అవుతుందన్న నమ్మకం కూడా అందరిలోనూ కలిగింది.ఇక ఈ సినిమా విడుదల తేది దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

ఇక ఈ వేడుకలో భాగంగా శ్రీ లీల నితిన్ కలిసి వేదికపై డాన్స్( Dance ) వేశారు అయితే ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో పలువురు శ్రీ లీల పట్ల అలాగే హీరో నితిన్ పట్ల కూడా ట్రోల్స్ చేస్తున్నారు అయితే నితిన్ ఆంజనేయ స్వామి మాల(Anjaneya Swamy Mala) వేసుకుని ఉండగా ఈయన వేదికపై డాన్స్ చేశారు.ఆయన పక్కన శ్రీ లీల కూడా చెప్పులు వేసుకుని( Slippers ) మరి డాన్స్ చేశారు దీంతో పలువురు నేటిజన్స్ ఈ విషయంపై వీరిద్దరిని ట్రోల్ చేస్తున్నారు.శ్రీ లీల చెప్పులు వేసుకుని ఇలా స్వామి పక్కన డాన్స్ చేయడం ఏంటి అంటూ కామెంట్ చేయడగా మరికొందరు మాత్రం స్వామి మాల వేసుకున్నటువంటి నితిన్ డాన్స్ చేయవచ్చా అంటూ కామెంట్లు చేస్తున్నారు.

నితిన్ వృత్తి సినిమాలలో నటించడం అలాంటప్పుడు ఆయన డాన్స్ వేయడంలో తప్పులేదు అంటూ కొందరు కామెంట్లు చేయగా వేదికపై ఎక్కి చెప్పులు వేసుకుని అలా స్వామి పక్కన డాన్స్ చేయడం తప్పు అంటూ మరికొందరు ఈ వీడియో పై ట్రోల్స్ చేస్తున్నారు.అయితే వీరిద్దరూ కూడా వారి వృత్తిలో భాగంగా సినిమా పనుల నిమిత్తమే ఇలా చేశారు అంటూ మరికొందరు వీరిద్దరికీ సపోర్ట్ చేస్తూ కామెంట్లు చేస్తున్నారు.ప్రస్తుతం ఈ డాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube