మిచాంగ్ తుపానుపై ఏపీ సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు.ఈ మేరకు తుపాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో జగన్ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.
తుపాను పట్ల ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సీఎం జగన్ తెలిపారు.బాపట్ల సమీపంలో రేపు తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారని పేర్కొన్నారు.
ఇప్పటికే జిల్లాల కలెక్టర్లకు నిధులు విడుదల చేశామన్న సీఎం జగన్ యుద్ధ ప్రాతిపదికన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఆదేశించారు.