మిచాంగ్ తుపాన్ ఏపీ వైపుకు దూసుకొస్తున్న సంగతి తెలిసిందే.తుఫాన్ ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి.
ఏపీ ప్రభుత్వం తుపాన్ సహాయక చర్యలపై దృష్టి పెట్టాలని టీడీపీ అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు.రాష్ట్రంలో రైతులకు నష్టాన్ని నివారించే విధంగా చర్యలు చేపట్టాలని తెలిపారు.
గతంలో వర్షాలతో రైతులు నష్టపోయినా ప్రభుత్వం స్పందించలేదని మండిపడ్డారు.అదేవిధంగా ధాన్యం కొనుగోలులో ఆంక్షలు తొలగించాలని డిమాండ్ చేశారు.
తుపాను బాధితులకు టీడీపీ కార్యకర్తలు అండగా ఉండాలని సూచించారు.మరోవైపు తుపాను తీవ్రత దృష్ట్యా యువగళం పాదయాత్రకు నారా లోకేశ్ విరామం ప్రకటించిన సంగతి తెలిసిందే.