వింటర్ లో ఇమ్యూనిటీని పెంచే బ్రెజిల్ నట్స్.. రోజుకు ఎన్ని తినాలంటే!

ప్రస్తుత వింటర్ సీజన్ లో ఇమ్యూనిటీ పవర్ ను పెంచుకోవడం ఎంతో అవసరం.లేదంటే జలుబు, దగ్గు, జ్వరం వంటి సీజనల్ వ్యాధులు చుట్టుముట్టి ఉక్కిరి బిక్కిరి చేసేస్తుంటాయి.

 Health Benefits Of Brazil Nuts During Winter , Brazil Nuts, Brazil Nuts-TeluguStop.com

అందుకోసమే రోగ నిరోధక వ్యవస్థను బలపరుచుకునేందుకు ప్రయత్నించాలి.అయితే అందుకు బ్రెజిల్ నట్స్ ఎంతో అద్భుతంగా హెల్ప్ చేస్తాయి.

న‌ట్స్ అంటే బాదం, వాల్ న‌ట్స్‌, పిస్తా, జీడిప‌ప్పు వంటివే చాలా మందికి గుర్తుకు వ‌స్తాయి.బ్రెజిల్ న‌ట్స్ ను ఎక్కువ శాతం మంది ప‌ట్టించుకోరుకానీ, బ్రెజిల్ న‌ట్స్ పోష‌కాల‌కు ప‌వ‌ర్ హౌస్ అని చెప్పుకోవ‌చ్చు.

ముఖ్యంగా ఈ నట్స్ ఇమ్యూనిటీ బూస్టర్ గా పనిచేస్తాయి.రోజుకు మూడు నుంచి నాలుగు బ్రెజిల్ నట్స్ ను తీసుకుంటే రోగ నిరోధక శక్తి చక్కగా పెరుగుతుంది.

దీంతో సీజనల్ వ్యాధులకు దూరంగా ఉండవచ్చు.దగ్గు మరియు జలుబు వంటి సమస్యలతో తరచూ బాధపడేవారికి ఈ నట్స్ ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి.

అందుకే ప్ర‌స్తుత చ‌లికాలంలో క‌చ్చితంగా బ్రెజిల్ న‌ట్స్( Brazil nuts ) ను డైట్ లో చేర్చుకోండి.

Telugu Brazil Nuts, Brazilnuts, Tips, Latest-Telugu Health

అలాగే బ్రెజిల్ నట్స్ ఆరోగ్యానికి మరెన్నో ప్రయోజనాలు చేకూరుస్తాయి.బ్రెజిల్ నట్స్ లో ఫైబర్ మెండుగా ఉంటాయి.క్రమం తప్పకుండా వీటిని మూడు లేదా నాలుగు చొప్పున తీసుకుంటే.

అందులోని ఫైబ‌ర్‌ ప్రేగు కదలికలను మెరుగుపరుస్తుంది.జీర్ణ ఆరోగ్యాన్ని ( Digestive health )ప్రోత్సహిస్తుంది.

తక్కువ బరువు ఉన్న వారికి ఈ నట్స్ ఎంతో మేలు చేస్తాయి.బ్రెజిల్ నట్స్ లో క్యాలరీలు సమృద్ధిగా ఉంటాయి.

అందువల్ల ఆరోగ్యకరమైన బరువు పెరుగుటలో సహాయపడతాయి.

Telugu Brazil Nuts, Brazilnuts, Tips, Latest-Telugu Health

బ్రెజిల్ నట్స్‌లో లభించే మెగ్నీషియం మరియు జింక్ వంటి ఖనిజాలు వివిధ జీవక్రియ ప్రక్రియలలో కీలక పాత్ర పోషిస్తాయి.అంతేకాదు, నిత్యం ఈ నట్స్ ను మూడు లేదా నాలుగు చొప్పున‌ తీసుకుంటే రక్తంలో చక్కర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.బ్రెజిల్ నట్స్ లో ఉండే సెలీనియం థైరాయిడ్ ( Thyroid )ఫంక్షన్ ను మెరుగుపరుస్తుంది.

మరియు ఈ నట్స్ ను తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ కరిగి గుండె ఆరోగ్యంగా సైతం మారుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube