దక్షిణాది సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటి మమతా మోహన్ దాస్ (Mamatha Mohan das) కూడా ఒకరు.ఈమె సింగర్ గా నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.
అయితే ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న సమయంలోనే భయంకరమైనటువంటి క్యాన్సర్ (Cancer) మహమ్మారి ఈమెను వెంటాడింది.ఇలా క్యాన్సర్ బారిన పడిన ఈమె ఈ వ్యాధి నుంచి కోలుకొని తిరిగేదావిధిగా పలు సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ప్రస్తుతం ఎంతో బిజీగా ఉన్నారు.
![Telugu Cancer, Geetham Nair, Mamtamohan, Mamta Mohan Das, Mamtamohandas, Tollywo Telugu Cancer, Geetham Nair, Mamtamohan, Mamta Mohan Das, Mamtamohandas, Tollywo](https://telugustop.com/wp-content/uploads/2023/11/Mamatha-mohan-das-serious-warning-to-social-media-to-spread-fake-news-detailsa.jpg)
ఇలా సినిమా పనులలో ఎంతో బిజీగా ఉన్నటువంటి మమతా మోహన్ దాస్ గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.గీతం నాయర్ (Geetham Nair) అనే మహిళ మమతా మోహన్ గురించి ఒక కథనం రాసి ఇంస్టాగ్రామ్ లో( Instagram ) పోస్ట్ చేశారు.ఇందులో భాగంగా ఇక బ్రతకలేను చావుకు లొంగిపోతున్నాను మమత మోహన్ దాస్ దుర్భర జీవితం ఇదే అంటూ ఈ వార్తను గీతం నాయర్ ప్రొఫైల్ ద్వారా షేర్ చేయబడింది.ఇక ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారి మమత మోహన్ దాస్ కంటపడింది.
![Telugu Cancer, Geetham Nair, Mamtamohan, Mamta Mohan Das, Mamtamohandas, Tollywo Telugu Cancer, Geetham Nair, Mamtamohan, Mamta Mohan Das, Mamtamohandas, Tollywo](https://telugustop.com/wp-content/uploads/2023/11/Mamatha-mohan-das-serious-warning-to-social-media-to-spread-fake-news-detailsd.jpg)
ఈ వార్తలపై స్పందించినటువంటి నటి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రచారం కోసమే ఇతరుల దృష్టి తమపై రుద్ధాలనే అసత్యాలను ప్రచారం చేయటం సరికాదు.అసలు మీరెవరు? ఎందుకు ఇలా చేస్తున్నారు? మీ పేజీ పై అందరి దృష్టి పడటానికి నేను ఏమైనా చెప్పాలా? ఇలాంటి నకిలీ పేజీలను అనుసరించకుండా ఉండండి.ఇలాంటి వాటి పట్ల జాగ్రత్త పడండి అంటూ ఈమె తన గురించి వచ్చినటువంటి అసత్యపు వార్తలపై స్పందించి సీరియస్ అయ్యారు.
ఇక ఈమె క్యాన్సర్ బారిన పడిన మాట వాస్తవమే అయినప్పటికీ క్యాన్సర్ తో పోరాడి విజయం సాధించి తిరిగి సినిమా పనులలో బిజీ అయ్యారు.కానీ ఈమె క్యాన్సర్ బారిన పడి చనిపోతున్నట్లు వార్తలు రాయడంతో ఈ వార్తలపై మమతా మోహన్ దాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు.