ఏపీలోని టీడీపీపై వైసీపీ మంత్రులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.టీడీపీ అధినేత చంద్రబాబు మేనేజ్ మెంట్ పునాదులు కదిలిపోవడం వలనే ఏడుపు అంటూ మంత్రులు మేరుగ, సిదిరి, రాజన్నదొరలు ఆరోపించారు.
న్యాయవ్యవస్థను గబ్బు పట్టించిందెవరో ప్రజలకు తెలుసని మంత్రులు అన్నారు.జగన్ పాలనకు రాష్ట్రంలోని సామాజిక వర్గాలు జై కొడుతున్నాయని తెలిపారు.
అనంతరం బీజేపీ చీఫ్ పురంధేశ్వరిపై మండిపడ్డ వైసీపీ మంత్రులు నాన్న కంటే మరిదిపై ఆమెకు మమకారం ఎక్కువైందని విమర్శించారు.రాష్ట్రంలో బీజేపీని టీడీపీకి అనుబంధ విభాగంగా మార్చారని వెల్లడించారు.