సోషల్ మీడియా అభివృద్ధి చెందిన తర్వాత ఒక మంచి విషయం అయినా లేదా ఒక చెడు విషయమైనా కూడా క్షణాలలో మొత్తం పాకి పోతుంది.ఇక సోషల్ మీడియా అభివృద్ధి చెందిన తర్వాత చాలామంది సెలబ్రిటీలపై కాస్త ఫోకస్ పెట్టారు.
ఒక సెలబ్రిటీ అనారోగ్య సమస్యల కారణంగా కొంతకాలం పాటు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్న లేక సోషల్ మీడియాలో యాక్టివ్ గా లేకపోయినా వారు చనిపోయారు అంటూ ఒక వార్తను వైరల్ చేస్తుంటారు.ఇలా ఇప్పటికి ఎంతోమంది సెలబ్రిటీలను సోషల్ మీడియా చంపేసిందని చెప్పాలి.
ఈ విధంగా సోషల్ మీడియా వేదికగా సెలబ్రిటీలు చనిపోయారు అంటూ వార్తలు చూసి ఒక్కసారిగా సదరు సెలబ్రిటీలు షాక్ అవుతున్నారు.

ఇలా ఎంతోమంది టాలీవుడ్ సీనియర్ సెలబ్రిటీలు చనిపోయారు అంటూ ఇదివరకు సోషల్ మీడియాలో వార్తలు రావడంతో స్వయంగా ఆ సెలబ్రిటీలు స్పందిస్తూ ఇంకా మేము బ్రతికే ఉన్నాము చనిపోయాం అంటూ ఇలా తప్పుడు వార్తలు రాయకండి అంటూ సదరు సెలబ్రిటీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.తాజాగా ఇలాంటి ఘటన బాలీవుడ్ ఇండస్ట్రీలో చోటు చేసుకుంది.బాలీవుడ్ బుల్లితెర నటిగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్నటువంటి జిగ్యాసా సింగ్ (Jigyasa Singh) మరణించారు అంటూ కొన్ని యూట్యూబ్ ఛానల్స్ థంబ్నెల్స్ పెట్టు పెద్ద ఎత్తున ఈ వార్తలను వైరల్ చేశారు అలాగే మరికొన్ని చానల్స్ ఈమె అంత్యక్రియలు జరుగుతున్నటువంటి ఫోటోలను కూడా వైరల్ చేశారు .

అనారోగ్య సమస్యల కారణంగా కొద్దికొద్ది రోజులుగా బుల్లితెర సీరియల్స్ కు దూరంగా ఉన్నటువంటి జిగ్యాసా చనిపోయారు అంటూ తన ఫోటోలనీ వైరల్ చేయడంతో ఈ వార్తలు ఆమె కంటపడటంతో ఒక్కసారిగా షాక్ అయింది దీంతో సోషల్ మీడియా వేదికగా తాను బ్రతికే ఉన్నానని ఇలాంటి తప్పుడు వార్తలను స్ప్రెడ్ చేయడం మానేయండి అంటూ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇలా తన గురించి వస్తున్నటువంటి తప్పుడు వార్తలకు సంబంధించిన స్క్రీన్ షాట్లను ఈమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ తాను బ్రతికే ఉన్నానని తన గురించి వస్తున్నటువంటి ఈ తప్పుడు వార్తలపై మండిపడ్డారు అయితే కొందరు ఈమె నిజంగానే చనిపోయిందని భావించి ఈమె ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఓం శాంతి, RIP అంటూ పోస్టులు చేయడం గమనార్హం.