తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ నిర్ణయం సరైనదేనని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు.గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను గవర్నర్ తమిళిసై తిరస్కరించిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలో గవర్నర్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు కిషన్ రెడ్డి తెలిపారు.గవర్నర్ కోటా అంటే రాజకీయ నేతలకు ఎమ్మెల్సీలు ఇవ్వడం కాదని చెప్పారు.
మేధావులు, ప్రజా సేవ చేసే వాళ్లకు గవర్నర్ కోటా ఎమ్మెల్సీ ఇస్తారని తెలిపారు.కేసీఆర్ కుటుంబానికి సేవ చేసే వాళ్లను ఎలా నామినేట్ చేస్తారని కిషన్ రెడ్డి ప్రశ్నించారు.