ఈ సినిమా హిట్ అయితే మహేష్ స్టార్ హీరో అవ్వలేడు అని చెప్పిన కృష్ణ...

తెలుగు సినిమా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ కృష్ణ( Superstar Krishna ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఆయన తీసిన సినిమాలు చూస్తే మనకు అర్థం అయిపోతుంది ఆయన ఎంత పెద్ద హీరో అనేది ఒకప్పుడు ఎన్టీఆర్, నాగేశ్వరరావు తర్వాత అంత గొప్ప క్రేజ్ సంపాదించుకున్న హీరోలలో కృష్ణ ఒకరు.నార్మల్ గా ఒక హీరో నుంచి సూపర్ స్టార్ గా ఎదిగిన కృష్ణ సినిమా ఇండస్ట్రీలో చాలా ప్రయోగాలు చేశారు.

 Superstar Krishna About Mahesh Babu Nani Movie Details, Mahesh Babu, Superstar K-TeluguStop.com

అందులో చాలావరకు సక్సెస్ కూడా అయ్యాయి.ఇక కృష్ణ తర్వాత ఆయన కొడుకు మహేష్ బాబు( Mahesh Babu ) ఇండస్ట్రీకి వచ్చాడు రాజకుమారుడు సినిమాతో ఆయన ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు ఆ సినిమా మంచి విజయం సాధించడంతో మహేష్ బాబు ఇండస్ట్రీలో హీరోగా ఆయన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు.

ఇక ఈ సినిమా తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పాటు చేసుకున్నాడు.ఇక ఇదే క్రమంలో మహేష్ బాబు గుణశేఖర్ తో చేసిన ఒక్కడు సినిమా( Okkadu Movie ) మంచి విజయాన్ని అందుకోవడం తో ఇండస్ట్రీ లో ఆయన స్థాయి తరస్థాయికి వెళ్లిపోయింది.

 Superstar Krishna About Mahesh Babu Nani Movie Details, Mahesh Babu, Superstar K-TeluguStop.com
Telugu Mahesh Babu, Nani, Nani Flop, Okkadu, Krishna, Tollywood-Movie

దాంతో ఆయన వరుసగా సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ అనే రేంజ్ ను సుస్థిరం చేసుకున్నాడు.అయితే ఒక్కడు తర్వాత వచ్చిన నాని సినిమా( Nani Movie ) భారీ అంచనాలతో రిలీజ్ అయినప్పటికీ ఈ సినిమాని ముందే చూసిన కృష్ణ ఈ సినిమా సక్సెస్ అయితే మహేష్ బాబు స్టార్ హీరో అవ్వలేడు అని ముందే చెప్పేశాడు.అది విన్న మహేష్ కి కృష్ణ అలా ఎందుకన్నాడు అనేది అర్థం కాలేదు.దాంతో ఆ సినిమా రిలీజ్ అయింది ప్లాప్ కూడా అయింది.

Telugu Mahesh Babu, Nani, Nani Flop, Okkadu, Krishna, Tollywood-Movie

అయితే మహేష్ బాబు మొదటి సినిమా నుంచి తన సినిమాల స్టోరీ సెలక్షన్ మొత్తం మహేష్ బాబే చూసుకుంటాడు.కాబట్టి ఒక్కడు తర్వాత నాని స్క్రిప్ట్ ను ఎంచుకోవడం రాంగ్ డిసిజన్ అని కృష్ణ ఇంతకుముందు చెప్పిన మాటల్లో అర్థం.ఆయనకు తెలుసు ఏ సినిమాలు చేస్తే స్టార్ హీరోలు అవుతారు, ఏ సినిమా చేస్తే మీడియం రేంజ్ హీరో గానే మిగిలిపోతారు అనేది అందుకోసమే ఆయన నాని సినిమా ఆడితే మహేష్ బాబు స్టార్ కాలేడు అని ముందే జోష్యం చెప్పేశాడు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube