శారద ఎన్నో తెలుగు సినిమాల్లో నటించి మెప్పించారు.ఒకప్పుడు తెలుగు తెరను ఏలిన నటిగా గుర్తింపు పొందారు.
అనంతరం ఎన్నో పపోర్టింగ్ రోల్స్ చేసి మంచి పేరు సంపాదించుకున్నారు.అటు మహా నటుడు ఎస్వీ రంగారావుతో కలిసి శారద కొన్ని సినిమాలు చేసింది.
వీరిద్దరు కలిసి తొలుత అభిమానవంతులు అనే సినిమాలో నటించారు.చివరి సారిగా జమీందారుగారి అమ్మాయి అనే చిత్రం చేశారు.
ఈ సినిమాలో వీరిద్దరు తండ్రి కూతుళ్లుగా నటించారు.అయితే అంతకు ముందు పలు సినిమాలు చేసినా వీరిద్దరి మధ్య అంతగా సంబంధాలు ఉండేది కాదు.
కానీ ఈ సినిమా తర్వాత ఇద్దరు మంచి సన్నిహితులయ్యారు.శారదను ఎస్వీఆర్ ఎప్పుడూ అమ్మాయి.
అమ్మాయి అని పిలిచేవారు.అంతేకాదు.
తన సొంత బిడ్డలా చూసుకునే వారు.
అటు జమీందారుగారి అమ్మాయి సినిమా షూటింగ్ సమయంలో శారదతో ఎస్వీఆర్ ఓ మాట చెప్పారు.
కేళంబాకంలో తనకు గార్డెన్ ఉన్నట్లు చెప్పాడు.దాన్ని మరింత బాగా డెవలప్ చేయాలి అనుకుంటున్నట్లు వెల్లడించాడు.
కానీ అది తనకు సాధ్యం కావట్లేదన్నారు.ఆ గార్డెన్ తనకు ఇస్తానని శారదకు చెప్పాడు.
ఆయన మాటలకు శారద నవ్వి ఊరుకునేది.అటు ఈ సినిమా సందర్భంగా వీరి మధ్య అభిమానాన్ని చూసి అందరూ అబ్బురపడేవారు.
ఎంత మంచి మనుషులో అనుకునేవారు.
ఈ సినిమా షూటింగ్ తర్వాత కొంత కాలానికే ఎస్వీఆర్ కన్నుమూశారు.శారద ఆయన మరణం పట్ల ఎంతో ఆవేదన వ్యక్తం చేసింది.ఆ తర్వాత 15 ఏండ్లకు శారద ఎస్వీఆర్ గార్డెన్ తీసుకుంది.
తన అమ్మమ్మ పేరిట తను కొనుగోలు చేసింది.అయినా ఆ గార్డెన్ కున్న ఎస్వీఆర్ పేరును తీయాలంటే బాధ అనిపించి.
అలాగే ఉంచింది.ఆయన ఎప్పుడో ఇస్తానని చెప్పిన గార్డెన్.
తను చనిపోయాక 15 ఏండ్ల తర్వాత నేను తీసుకోవడం సంతోషంగా ఉందని శారద వెల్లడించింది.ఆయన ఆప్యాయతకు, అభిమానికి గుర్తు ఈ గార్డెన్ అని ఆమె వెల్లడించారు.
ఎస్వీఆర్ మాట ఇచ్చాడు.శారద ఆ మాట నిలబెట్టుకుంది.