అక్కడ అడుగుపెట్టాలంటే నెగటివ్ రిపోర్ట్ కంపల్సరీ..!

కరోనా డెల్టా వేరియెంట్ కేసులు పెరుగుతున్న ఈ తరుణంలో కర్ణాటల మహారాష్ట్ర సరిహద్దుల్లో కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు.ముఖ్యంగా మహారాష్ట్ర నుండి కర్ణాటక లోకి వచ్చే వారికి తప్పనిసరిగా కరోనా టెస్ట్ నెగటివ్ రిపోర్ట్ ఉండాల్సిందే అని నిబంధన పెట్టారు.

 Covid Negative Certificate Must To Enter Karnataka From Maharashtra, Covid Negat-TeluguStop.com

పోలీసు, వైద్య శాఖ సం యుక్తంగా చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేశారు.చెక్ పోస్టులను స్వయంగా అధికారులు పరిశీలించారు.

సరిహద్దులోని కాగ్నలి చెక్ పోస్ట్ లో తహసీల్దారుతో పాటు పోలీస్ అధికారులు పర్యవేక్షిస్తున్నారు.

ఇక్కడే కాకుండా ఇతర చెక్ పోస్టులలో కూడా అదే విధమైన కట్టి దిట్టమైన నిబంధనలు ఉండేలా చూస్తున్నారు.

అటు కేరళ సరిహద్దులోనూ ఇదే తరహా ఆంక్షలతో కూడిన విధానం కొనసాగుతున్నాయి. కరోనా డెల్టా ప్లస్ వేరియెంట్ ఎక్కువగా స్ప్రెడ్ అవుతుందని.

దాని గురించి అందరు జాగ్రత్త పడాలని వైద్య అధికారులు సూచిస్తున్నారు.ఈ క్రమంలో రాష్ట్ర సరిహద్దులలో తగిన ఆంక్షలను విధిస్తున్నారు.

కేవలం మహా రాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల సరిహద్దులే కాకుండా అన్ని రాష్ట్రాల సరిహద్దుల్లో కూడా ఇదే విధమైన ఆంక్షలతో కూడిన నిబంధనలు పెట్టారని తెలుస్తుంది.  రాష్ట్రాలన్ని దాదాపు లాక్ డౌన్ ఎత్తివేయగా ప్రజలు తమ జాగ్రత్తలతోనే కరోనాని నియంత్రించాలని ప్రభుత్వాలు చెబుతున్నాయి.

రాష్ట్ర సరిహద్దుల్లో మాత్రం కొన్ని చోట్ల ఆంక్షలు విధించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube