అక్కినేని నాగేశ్వరరావు( Akkineni Nageswara Rao )… తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక దిగ్గజం లాంటి వ్యక్తి.ఆయన సినిమా వస్తుంది అంటే చాలు యావత్తు తెలుగు రాష్ట్రం సినిమా థియేటర్ల ముందు వాలిపోయేవారు.
సమకాలికుడు ఎన్టీఆర్ తో దీటుగా సినిమాలు తీసి ఇండస్ట్రీకి వీరిద్దరూ రెండు కళ్లుగా ఉండేవారు.సినీమా పరిశ్రమను హైదరాబాద్ కి రప్పించడంలో కీలక పాత్రను పోషించిన వారిలో అక్కినేని కూడా ఒకరు.
ఎన్టీఆర్ తో కన్నా కూడా అక్కినేని తో సినిమాల తీయడానికి హీరోయిన్స్ ఎంతో ఉత్సాహంగా ఉండేవారు ఎందుకంటే అక్కినేని సెన్సార్ హ్యూమర్ చాలా ఎక్కువ ఎప్పుడు జోకులు వేస్తు, నవ్విస్తూ హీరోయిన్స్ నీ ఎప్పుడూ తన చుట్టూ తిప్పుకుంటూ ఉండేవారు.

ఇక ప్రస్తుతం అక్కినేనికి వంద సంవత్సరాల జయంతి ఉత్సవాలు కూడా జరుగుతున్నాయి.అక్కినేని శిలా విగ్రహాన్ని అన్నపూర్ణ స్టూడియో( Annapurna Studios )లోనే ప్రతిష్టించిన విషయం మనమందరం చూసాం.ఈ వేడుకకు టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ నుంచి కూడా ప్రముఖులు ఎంతో మంది హాజరయ్యారు ఆయన విగ్రహానికి నివాళులర్పించారు.
అయితే మీరు గమనిస్తే ఆయన శిలా విగ్రహం యొక్క రూపం ఏదైతే ఉందో అది అచ్చుగుద్దినట్టు ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్న విధంగా ఉంటుంది.ఈ ఫోటో ఆధారంగానే శిల్పి ఆ విగ్రహాన్ని తయారు చేశారు.

అయితే ఈ ఫోటో కెమెరాతో తీసిన చిత్రం కాకపోవడం విశేషం దీనిని 1961 లో చేమకూర సత్యనారాయణ గారు( Chemakura Satyanarayana ) ఆయిల్ పెయింట్ తో గీశారు.సజీవంగా అక్కినేని నిజంగానే అక్కడ నిలబడ్డారా అన్నట్టుగా నిలువెత్తు మనిషిని ఎంతో చక్కగా చిత్రాన్ని గీశారు.చిత్రపటం ఆధారంగానే ప్రస్తుతం 100 సంవత్సర జయంతి వేడుకలకు శిల్పాన్ని తయారు చేశారు చెన్నైలోని శిల్పి.అలా ఈ ఫోటో వెనుక చేమకూర సత్యనారాయణ గారి కష్టం ఎంతో ఉంది.
చాలా మంది ఆయిల్ పెయింట్ వేస్తారు కానీ అక్కినేని వారి ఆయిల్ పెయింట్ లో ఎంతో సజీవం ఉట్టిపడుతోంది.ఆయన మూలవ జయంతి ఉత్సవాల సందర్భంగా ఈ ఆర్టికల్ కూడా అక్కినేని వారికి అంకితం.