కమెడియన్ గా నువ్వే నువ్వే సినిమా( Nuvve Nuvve )తో తెలుగు సినిమా ఇండస్ట్రీ కి పరిచయం అయ్యాడు సునీల్( Sunil ).నిజానికి కమిడియన్ అవ్వడం కన్నా కూడా డ్యాన్సర్ అవ్వాలని సునీల్ అనుకునే వాడట.
కానీ కొన్నాళ్ళు సినిమాల్లో నటించి బాగానే సెటిల్ అయ్యాక ఎందుకో హీరో అవ్వాలనే కుతూహలం మొదలయింది.అనుకున్నట్టుగానే రాజమౌళి ఈగ సినిమాతో హీరో అయిపోయాడు.
కానీ అక్కడ నుంచే అతడికి కష్టాలు మొదలయ్యాయి.మళ్లి కమిడియన్ గా చేయడానికి సునీల్ కి మనసు ఒప్పలేదు.
దాంతో హీరోగా కొన్ని సినిమాల్లో నటించాక రియాలిటీ అర్ధం అయ్యింది.కానీ వెనక్కి వెళ్లే అవకాశం లేకుండా ఇరుక్కుపోయాడు.
టైం అయితే గడుస్తుంది కానీ సినిమాలు మాత్రం రావడం లేదు.దాంతో విలనిగా మారిపోయాడు.

పుష్ప ( Pushpa movie )వంటి ఒక ఫ్యాన్ ఇండియా సినిమాలో మంగళం శీను గా సునీల్ పాత్ర బాగానే సెట్ అయ్యింది.అప్పటి నుంచి సెమి విలన్ గా, పూర్తి స్థాయి విలన్ గా కూడా నటించడం మొదలు పెట్టాడు.దాంతో కెరీర్ మళ్లి పుంజుకుంది.వరస పెట్టి అవకాశాలు రావడం మొదలు అయ్యాయి.2021 లో పుష్ప తర్వాత అతడు 2022 లో ఏకంగా 16 సినిమాల్లో నటించాడు.చిన్న, పెద్ద అనే తేడా లేకుండా ఏది వస్తే అది చేస్తూ వెళ్తున్నాడు.
ఇక క్రమంలో 2023 లో మొదటి ఆరు నెలల్లోనే 11 సినిమాల్లో నటించగా అవి విడుదల కూడా అయ్యాయి.అందులో జైలర్, మార్క్ ఆంటోనీ, విరూపాక్ష పెద్ద సినిమాలతో పాటు కొన్ని చిన్న సినిమాలు కూడా ఉన్నాయ్.

అయితే సునీల్ ( Sunil )ఇప్పుడు మరోమారు తన రూటు మార్చుకుంటున్నాడు.పూర్తి స్థాయి తమిళ నటుడిగా మారిపోతున్నాడు .ఎందుకంటే ప్రస్తుతం అతడి చేతి నిండా తమిళ సినిమాలు ఉన్నాయ్.మావీరం అనే తమిళ సినిమాతో తన డెబ్యూ చేసిన సునీల్ జైలర్, మార్క్ ఆంటోనీ( Mark Antony ) వంటి పెద్ద తమిళ సినిమాల్లో కూడా కనిపించాడు.
ఇవి సునీల్ కెరీర్ కి చాల బాగా ఉపయోగపడ్డాయి.ఇక ఇప్పుడు జపాన్, ఈగై, బుల్లెట్ వంటి మరో మూడు తమిళ సినిమాల్లో మంచి పాత్రల్లో కనిపించబోతున్నాడు.
వీటితో పాటు పాన్ ఇండియా సినిమాలు అయినా పుష్ప 2, గుంటూరు కారం( Guntur Kaaram ) గేమ్ చెంజర్ సినిమాల్లో కూడా సునీల్ సందడి చేయబోతున్నాడు.