సినీ ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.ఇండస్ట్రీలో ఎక్కువ మంది ఒకే కుటుంబం నుంచి వచ్చి, ప్రతి ఒక్కరు వారికంటూ సెపరేట్ క్రేజ్ సంపాదించుకున్నారు.
ఇండస్ట్రీలో ఎక్కువ మంది ఉన్న కుటుంబం ఏదైనా ఉంది అంటే వెంటనే అందరు మెగా ఫ్యామిలీ అంటారు.ముందు చిరంజీవి( Chiranjeevi ) ఇండస్ట్రీలో వచ్చి మెగాస్టార్ అయ్యి మంచి ప్లాట్ ఫామ్ వేశారు.
ఆ తరువాత వచ్చిన పవన్ కళ్యాణ్, అల్లుఅర్జున్ కూడా తక్కువ టైంలోనే వారికంటూ సెపెరేట్ క్రేజ్ సంపాదించుకున్నారు.ఇప్పటికి ఆ ఫ్యామిలిలో నుంచి హీరోలు వస్తూనే ఉన్నారు.
అయితే ఇప్పుడు మెగా హీరోలు కూడా భారీ రెమ్యునరేషన్లు తీసుకుంటున్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.అయితే అదే ఇప్పుడు నిర్మాతలకు సమస్యగా మారిందట.
ఇప్పుడు అసలు విషయం ఏంటో చూద్దాం.
![Telugu Bhola Shankar, Chiranjeevi, Heros, Pawan Kalyan, Tollywood, Vaishnav Tej, Telugu Bhola Shankar, Chiranjeevi, Heros, Pawan Kalyan, Tollywood, Vaishnav Tej,](https://telugustop.com/wp-content/uploads/2023/08/Chiranjeevi-Varun-Tej-Pawan-Kalyan-Vaishnav-Tej-Bhola-Shankar-tollywood.jpg)
మెగా, పవర్, ఐకానిక్ స్టార్ ల గురించి చెప్పాల్సిన అవసరం లేదు.అయితే వీరి మార్కెట్ చాలా హై ఉంటుంది.దీంతో విల్లా రెమ్యునరేషన్లు కూడా భారీగా ఉన్నాయి.
అయితే ఇప్పుడిప్పుడే క్రేజ్ పెంచుకుంటున్న సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ లు కూడా రెమ్యునరేషన్లు పెంచేస్తున్నారట.అయితే వీరి సినిమాలు డిజాస్టర్లు అవుతుండడంతో నిర్మాతలు నిండా మునిగిపోతున్నారు.
వరుసగా సినిమాలు తీస్తున్నప్పటికీ మినిమం ఓపెనింగ్స్ కూడా రావడం లేదు.దీంతో నిర్మాతలు కోట్లలో నష్టపోతున్నారు.
సాయిధరమ్‌తేజ్ ముందులో 8 కోట్లు రెమ్యునరేషన్ తీసుకునేవారు.అయితే ఇప్పుడు మరో 5 కోట్లు పెంచినట్టు ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది.
ఇక వరుణ్ తేజ్( Varun Tej ) గురించి చెప్పనక్కర్లేదు.ఎఫ్2 – ఎఫ్3 – గద్దలకొండ గణేష్, ఫిదా తప్ప పెద్ద హిట్లు లేవు.గతేడాది వచ్చిన గని డిసాస్టర్ అయ్యింది.ఇక తాజాగా వచ్చిన గాండీవ ధారి అర్జున కూడా మొదటిరోజు నుంచే నెగటివ్ టాక్ తెచ్చుకుంది.ఈ సినిమాకి వరుణ్ 9 కోట్లు తీసుకున్నారు అని టాక్ నడుస్తుంది.అంతేకాదు ఇప్పుడు వరుణ్ కూడా తన రెమ్యునరేషన్ 3 కోట్లు పెంచేసినట్టు టాక్.
ఇక మొదటి సినిమాతో సంచలనాలు సృష్టించిన వైష్ణవ్ తేజ్( Vaishnav Tej ) కూడా తరువాత ఒక్క హిట్ కూడా అందుకోలేదు.అయితే వైష్ణవ్ కూడా 8 కోట్లు తీసుకుంటున్నట్టు సమాచారం.
![Telugu Bhola Shankar, Chiranjeevi, Heros, Pawan Kalyan, Tollywood, Vaishnav Tej, Telugu Bhola Shankar, Chiranjeevi, Heros, Pawan Kalyan, Tollywood, Vaishnav Tej,](https://telugustop.com/wp-content/uploads/2023/08/Chiranjeevi-Varun-Tej-Pawan-Kalyan-Vaishnav-Tej-Bhola-Shankar.jpg)
ఇక మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమాలు కూడా ఈమధ్య బాక్స్ ఆఫీస్ ముందు బోల్తా కొడుతున్నాయి.ఒక్క సినిమా కూడా మెగాటర్ రేంజ్ హిట్ కొట్టడం లేదు.దీంతో నిర్మాతలు నష్టపోతున్నారు.భోళాశంకర్( Bhola Shankar ) సినిమాకు చిరంజీవి 70 కోట్లు తీసుకోగా, సినిమా ప్లాప్ అవ్వడంతో 10 కోట్లు తిరిగి ఇచ్చేశారట.ఇక పవన్ కళ్యాణ్ గురించి చెప్పనక్కర్లేదు.సినిమాకి తక్కువ రోజులు టైం ఇవ్వడమే కాకుండా తను నటించే 20 నుంచి 30 రోజులకే 50 కోట్లు తీసుకుంటున్నట్టు సమాచారం.తాజాగా నటించిన బ్రో సినిమాకి 22 రోజుల షూటింగ్ చేసి రు.55 – 60 కోట్లు తీసుకున్నాడు.అయితే పవన్ కళ్యాణ్ నటించిన సినిమాలు ఎక్కువగా లాభాలు తేకపోవడంతో నిర్మాతలు నష్టపోతున్నారు.ఇక ఐకానిక్ స్టార్ అల్లుఅర్జున్( Allu Arjun ) కూడా భారీ రెమ్యునరేషన్ లు తీసుకుంటున్నాడు.
ఇప్పుడు బన్నీ ఫ్యాన్ ఇండియా సినిమాలు చేస్తున్నాడు.పుష్ప ఏ రేంజ్ హిట్ కొట్టిందో అందరికి తెలిసిందే.
కానీ ఏపీ, తెలంగాణ బయ్యర్లు చాలా ఏరియాల్లో నష్టపోయారు.ఏది ఏమైనా మెగా హీరోలు రెమ్యునరేషన్లు పెంచుకుంటూ పోతే నిర్మాతలు నష్టపోయే అవకాశం ఉంది.