రాజన్న సిరిసిల్ల జిల్లా : రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల శివారులో దేశాయి బీడీ కంపెనీ ముందు అనుమానంగా సంచరిస్తున్న నలుగురు వ్యక్తులు ఆరుట్ల, ముస్తాబాద్, పడాల వెంకట సాయి గూడెం, మండాటి చందు ముస్తాబాద్ ,శివరాత్రి తిరుపతి ఎల్లారెడ్డిపేట వ్యక్తులను తనిఖీ చేయగా
ఒక్కొక్కరి వద్ద 100 గ్రాముల గంజాయి లభించిందని ఎక్సైజ్ శేఖర్ రెడ్డి తెలిపారు.వెంటనే ముస్తాబాద్ తహశీల్దార్ ఆధ్వర్యంలో పంచనామ నిర్వహించి 400 గ్రాముల గంజాయి, నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.