వరద పట్టణంలోకి రాకుండా మధ్య మానేరులో వెళ్లేలా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నాం

పట్టణంలోకి నిన్న వచ్చిన సర్ ప్లస్ వాటర్ సోర్స్( Plus a water source ) అధ్యయనం చేసి విశ్లేషించాం.ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా చర్యలు చేపడతాం.

 We Are Looking For Alternative Ways To Go Through Madhya Maneru Without Entering-TeluguStop.com

కొత్త చెరువు మాదిరి పట్టణం పై ఉన్న చెరువులకు గేట్లను బిగించి వర్షాకాలం కు ముందు నీరు 50 శాతం మాత్రమే ఉండేలా చూస్తాం.జిల్లాలో వాటర్ ఫ్లో ఉన్న చోట కు ప్రజలు, మత్యకారులు ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్లొద్దు.

భారీ వర్షాలు నేపథ్యంలో వస్తున్న వరదలను దృష్టిలో పెట్టుకొని ప్రజలు స్వీయ జాగ్రతలు పాటించాలి.సీజనల్ వ్యాధులు ప్రబలకుండా డ్రై డే కార్యక్రమాలు( Dry day events ) చేపట్టాలి.

అధికారులకు, మీడియాకు జిల్లా కలెక్టర్ అభినందన రాజన్న సిరిసిల్ల జిల్లా:ఎగువ ప్రాంతాల నుండి వచ్చే వర్షపు వరద పట్టణంలోకి రాకుండా మధ్య మానేరులో శాశ్వతంగా వెళ్లేలా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నామని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి తెలిపారు.నిన్న జిల్లా లో భారీ వర్షాలు నేపథ్యంలో శుక్రవారం కొత్త చెరువు, వెంకంపేట వరద ప్రభావిత ప్రాంతాలు, దోభీ ఘాట్, పెద్ద బోనాల లోని బై పాస్ కల్వర్టు, జంగవాని కుంట, చిన్న బోనాల లో తెగిన పెద్ద చెరువును, చంద్రం పేట ఈదుల చెరువును జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళా చక్రపాణి, రాష్ట్ర పవర్ లూం, టెక్స్ టైల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ చైర్మెన్ గూడూరి ప్రవీణ్ , మున్సిపల్ వైస్ చైర్మన్ మంచె శ్రీనివాస్ , స్థానిక కౌన్సిలర్ లు, అధికారులతో కలిసి శుక్రవారం పరిశీలించారు .సిరిసిల్ల పట్టణంలోకి నిన్న వచ్చిన సర్ ప్లస్ వాటర్ సోర్స్ ను స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి అధ్యయనం చేసి విశ్లేషించామన్నారు.భారీ వర్షాల వల్ల వెంకం పేట కాలనీలకు వరదలు వచ్చినందున మంత్రి కే తారక రామారావు మార్గదర్శనం మేరకు ఇలాంటి సమస్యలు భవిష్యత్తులో రాకుండా ఎట్లా బెటర్ గా హ్యాండిల్ చేయాలో ఇరిగేషన్, మున్సిపల్, రెవెన్యూ అధికారులతో చర్చించామన్నారు.

కొత్త చెరువు మాదిరిగానే వర్షకాలం కు ముందే చెరువుల లో ఉన్న వాటర్ ను ఖాళీ చేసేలా, వర్షాకాలంలో చెరువులు తెగి ప్రమాదాలు సంభవించకుండా చూసేందుకు వాటికీ గేట్లను ( షటర్ లు) బిగిస్తామని చెప్పారు.రానున్న రోజుల్లో రాజన్న సిరిసిల్ల జిల్లాకు వర్షా సూచన ఉన్న నేపథ్యంలో ప్రజలు ప్రమాదాల బారిన పడకుండా స్వీయ జాగ్రత్తలను పాటించాలన్నారు వాటర్ ఫ్లో ఉన్న చోటికి ఎట్టి పరిస్థితుల్లోనూ జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.

జిల్లాలో నిరంతరయంగా కురుస్తున్న వర్షాల వల్ల ప్రజలు జ్వరం ,సీజనల్ వ్యాధుల బారిన పడే అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ అన్నారు.అన్ని గ్రామాలు, పట్టణాలలో ప్రజలు ప్రతి మంగళవారం, శుక్రవారం డ్రైడే పాటిస్తూ తమ ఇండ్లలో నీరు నిలవ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి అన్నారు.

ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలన్నారు.కలెక్టర్ క్షేత్ర పరిశీలనలో భాగంగా తొలుత కొత్త చెరువు మత్తడి నీ పరిశీలించారు.మత్తడి మీదుగా ఉదృతంగా వర్షపు నీరు ప్రవహిస్తున్న ప్రజలు చేపలు పట్టకుండా మానిటర్ చేయాలన్నారు.పార్క్ ను మూసి వేయాలనీ మున్సిపల్ కమిషనర్ కు సూచించారు.

ఈదుల చెరువు ఫ్రేమ్ లు ఇప్పటికే బిగించినందున రెండు రోజుల్లో గేట్లు పెట్టాలని జిల్లా కలెక్టర్ ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు.పెద్ద బోనాల బై పాస్ కల్వర్టు వద్ద నీటి ప్రవావం ను పరిశీలించిన జిల్లా కలెక్టర్.

లెవెల్ ల ఆధారంగా పెద్ద బోనాల బై పాస్ కల్వర్టు నుంచి నేరుగా వరద నీరు మద్య మానేరు జలాశయంలో కలిసేందుకు వీలుగా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించి తనకు రిపోర్ట్ రెండు రోజుల్లో అందజేయాలన్నారు.ఈజ్ ఆఫ్ డూయింగ్ గా ప్రత్యామ్నాయ మార్గాలు ఉండాలన్నారు.

అనంతరం చిన్న బోనాల గ్రామంలో గండిపడిన పెద్ద చెరువును క్షేత్రస్థాయిలో పరిశీలించారు.గండిపడినచోట ఇసుక బ్యాగులతో వెంటనే గండిని పూడ్చాలన్నారు.

ఆ తర్వాత చెరుకు శాశ్వత మరమ్మతులు చేసి గేట్లను ఏర్పాటు చేయాలన్నారు.చిన్న బోనాల పెద్ద చెరువు పైన ఉన్న చెరువుకు కూడా గేట్లు బిగించే అంశాన్ని పరిశీలించాలని ఇరిగేషన్ అధికారులకు జిల్లా కలెక్టర్ ఆదేశించారు.

చివరగా ఈదుల చెరువును పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఇప్పటికే సిద్దం చేసిన గేట్లను వెంటనే బిగించాలని ఇరిగేషన్ అధికారులకు సూచించారు.నిండిన చెరువును చూసేందుకు ప్రజలు అధిక సంఖ్యలో వస్తున్న దృష్ట్యా ఉదయం, సాయంత్రం వేళల్లో చెరువును మానిటరింగ్ చేయాలని స్థానిక తహసిల్దార్ విజయ్ కుమార్ ను కలెక్టర్ ఆదేశించారు.

అధికారులకు, మీడియాకు జిల్లా కలెక్టర్ అభినందన గురువారం కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో జిల్లాలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా చూసిన రెవెన్యూ, పోలీస్, మున్సిపల్, ఇరిగేషన్ , పంచాయితీ రాజ్ అధికారులు జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అభినందించారు.క్షేత్ర పరిస్థితులను ఎప్పటికప్పుడు కవర్ చేస్తూ ప్రసార మాధ్యమాల ద్వారా తమ దృష్టికి తీసుకువచ్చి, జిల్లా యంత్రాంగంను అప్రమత్తం చేసిన మీడియా ప్రతినిధుల కు కలెక్టర్ ధన్యవాదాలు తెలిపారు.

రానున్న రోజుల్లో ఇదే ప్రేరణతో పని చేయాలని కోరారు.క్షేత్ర పర్యటనలో కలెక్టర్ వెంట ఆర్డిఓ ఆనంద్ కుమార్, మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, జిల్లా ఇరిగేషన్ అధికారి గంగం శ్రీనివాసరెడ్డి, స్థానిక తహసిల్దార్ విజయకుమార్ తదితరులు ఉన్నారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube