రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని కిషన్ దాస్ పేటలో శుక్రవారం నూకల ఎల్లవ్వ ఇంటిలో ఒగ్గు పరశురాములు నరసవ్వ తమ ఇద్దరు కూతుర్లతో అద్దెకు ఉంటున్నారు.ఈరోజు ఉదయం ఇంటిలో ఉన్న దేవుని గది శుభ్రం చేసి బయటకు వచ్చిన వెంటనే ఒక్కసారిగా ఇంటి పైకప్పు కుప్పకూలిపోయింది.
భారీ శబ్దం రావడం వల్ల కుటుంబ సభ్యులు బయటకి పరుగులు తీశారు.దీంతో పెను ప్రమాదం తప్పిందని అన్నారు.
అలాగే ఒగ్గు రాజవ్వ, మల్లయ్య ఇండ్లను సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వారం రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో శిథిలావస్థలో ఉన్న ఇండ్లలో ఎవరు కూడా నివసించవద్దని అన్నారు.
కూలిపోయిన ఇండ్లలో నివసించే కుటుంబాలను పరామర్శించి మీరు అధైర్య పడకండి మీకు నేను అండగా ఉన్నానని భరోసాని ఇచ్చారు.వర్షాలు తగ్గుముఖం పట్టే వరకు తన ఫంక్షన్ హాల్ లో ఉండాలని వారికి తగిన సౌకర్యాలు కల్పిస్తానని, భోజన సౌకర్యాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
ఇంకా ఎవరైనా గ్రామంలో శిథిలావస్థలో ఉన్న ఇండ్లలో ఉంటే వారు నేరుగా తనకు సమాచారం ఇవ్వాలని ఈ సందర్భంగా తెలియజేశారు.వెంటనే పంచాయతీ కార్యదర్శిని కూలిపోయిన ఇండ్ల జాబితాను సిద్ధం చేయాల్సిందిగా తెలిపారు.
అనంతరం ఎల్లారెడ్డిపేట మండల తహసిల్దార్ జయంత్ కుమార్ కూలిన ఇండ్లను పరిశీలించి అందరూ అప్రమత్తంగా ఉండాలని, కూలిపోయిన ఇండ్ల జాబితాను ప్రభుత్వానికి నివేదిక పంపిస్తానని అన్నారు.సర్పంచ్ వెంట గ్రామ ఉపసర్పంచ్ ఒగ్గు రజిత యాదవ్, మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్, వార్డు సభ్యులు ద్యాగం లక్ష్మీనారాయణ,న్యాలకంటి దేవేందర్, కోడిమోజు దేవేందర్, బిజెపి టౌన్ ప్రెసిడెంట్ నేవూరి శ్రీనివాస్ రెడ్డి, నేవూరి సురేందర్ రెడ్డి, నూకల శ్రీనివాస్ యాదవ్ కాలనీవాసులు ఉన్నారు.







