పిల్లా నువ్వు లేని జీవితం, సీమ శాస్త్రి, ఈడోరకం ఆడోరకం వంటి హాస్య ప్రధాన చిత్రాలతో రచయితగా తనదైన ముద్రవేసుకున్న డైమండ్ రత్నబాబు( Diamond Ratnababu ) దర్శకత్వంలో రూపొందిన హిలేరియస్ ఎంటర్ టైనర్ ‘అన్ స్టాపబుల్’.‘అన్ లిమిటెడ్ ఫన్’ అన్నది ఉపశీర్షిక.బిగ్ బాస్ విన్నర్ విజె సన్నీ( Vj sunny ), సప్తగిరి హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రంలో నక్షత్ర, అక్సాఖాన్ హీరోయిన్లు.ఎ2 బి ఇండియా ప్రొడక్షన్ లో రజిత్ రావు ఈ చిత్రాన్ని నిర్మించారు.జూన్ 9న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి స్పందన లభించింది.అలాగే IMDB లో 7.8 రేటింగ్ , బుక్ మై షో లో 8.2 రేటింగ్ రావడం విశేషం.
తాజాగా ‘అన్ స్టాపబుల్( Unstoppable )’ సినిమా అమెజాన్ ప్రైమ్ లో విడుదల అయ్యింది.థియేటర్స్ లో మిస్ అయిన ప్రేక్షకులు ఓటిటి లో చూసి ఎంజాయ్ చెయ్యవచ్చు.చక్కటి హాస్యం తో కూడిన ఈ సినిమాను కుటుంభం మొత్తం కలిసి వీక్షించవచ్చు.ఎ2 బి ఇండియా ప్రొడక్షన్ లో రజిత్ రావు నిర్మించిన మొదటి సినిమా అన్ స్టాపబుల్ .త్వరలో మరిన్ని మంచి సినిమాలతో నిర్మాత రంజిత్ రావ్ రాబోతున్నారు.వాటి వివరాలు త్వరలో తెలియనున్నాయి.