తెలుగు సినీ ఇండస్ట్రీలో నటులుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో మెగాస్టార్ చిరంజీవి( Chiranjeevi ) ఒకరు అలాగే ఈయనని స్ఫూర్తిగా తీసుకొని ఇండస్ట్రీలోకి ఎంతో మంది మెగా హీరోలు వచ్చారు.ఇలా మెగా హీరోగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ( Allu Arjun ) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
ఈయన ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ హీరోగా గుర్తింపు సంపాదించుకున్నారు.ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2సినిమా( Pushpa 2 Movie ) షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.
అయితే తాజాగా ఈయన బేబీ సినిమా అప్రిసియేషన్ ఈవెంట్ లో పాల్గొన్న విషయం మనకు తెలిసిందే.

చిత్ర బృందాన్ని ప్రశంసిస్తూ అల్లు అర్జున్ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన మాట్లాడుతూ పుష్ప 2 సినిమాలోని ఒక డైలాగ్ లీక్ చేశారు.పుష్ప 2’ సినిమాకు సంబంధించి ఈ విధంగా అప్‌డేట్ ఇవ్వాల్సి వస్తుందని అనుకోలేదు.ఇక్కడ చెబుతానని కూడా అనుకోలేదు.
ఈడంతా జరిగేది ఒక్కటే రూల్ మీద జరుగుతుంటాది.ఆ రూల్ పుష్ప గాడి రూల్ అంటూ ఒక డైలాగ్ లీక్ చేశారు.
ప్రస్తుతం ఈ డైలాగ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.అయితే అల్లు అర్జున్ ఇలా చెప్పడంతో కొందరు అల్లు అర్జున్ తో పాటు తన మామయ్య చిరంజీవి పట్ల కూడా కామెంట్స్ చేస్తున్నారు.

చిరంజీవి తన సినిమాలకు సంబంధించిన అన్ని విషయాలను కూడా పలు సందర్భాలలో లీక్స్ చేస్తూ ఉంటారు.ఇలా చిరంజీవి లీక్ చేయడంతో అభిమానులు ఏకంగా చిరు లీక్స్ ( Chiru Leaks ) అంటూ పేరు పెట్టేశారు.అయితే మామయ్య బాటలోని అల్లుడు అల్లు అర్జున్ కూడా నడుస్తూ తన సినిమాలకు సంబంధించిన విషయాలను లీక్ చేయడంతో ప్రస్తుతం అల్లు లీక్స్ ( Allu Leaks ) అంటూ కూడా కొందరు అల్లు అర్జున్ పట్ల కామెంట్లు చేస్తున్నారు.ఇలా సినిమా అప్డేట్లను లీక్ చేయడంలో మామ అల్లుడు అసలు తగ్గట్లేదుగా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఏది ఏమైనా అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా నుంచి లీక్ చేసినటువంటి ఈ డైలాగ్ అభిమానులకు మంచి కిక్ ఇచ్చాయని చెప్పాలి.







