వ్యవసాయ రంగంలో( agriculture ) అత్యాధునిక టెక్నాలజీలతో ఎన్నో రకాల యంత్రాలు, పనిముట్లు అందుబాటులోకి వచ్చిన వాటి వ్యయం అధికంగా ఉండడంతో చాలామంది సన్నకారు రైతులు ఆర్థికపరంగా ఇంకా సతమతమవుతూనే ఉన్నారు.చాలామంది ట్రాక్టర్లు కొని వ్యవసాయం చేయలేని పరిస్థితి.
అయితే ఓ రైతు ఈ సమస్యలకు చక్కటి పరిష్కారం కోసం ఒక విన్నుత ఆవిష్కరణను రూపొందించాడు.అదే బుల్లెట్ ట్రాక్టర్( Bullet tractor ).ఈ బుల్లెట్ ట్రాక్టర్ లో బుల్లెట్ బాడీ, ఆటో ఇంజిన్, ట్రాక్టర్ పనితనం ఉంటుంది.ఈ ట్రాక్టర్ తో తక్కువ సమయంలో ఎక్కువ పని చేయడమే కాకుండా ఖర్చు కూడా ఎంతో ఆదా అవుతుంది అని నల్లగొండ జిల్లా రైతులు తెలిపారు.
ఈ బుల్లెట్ ట్రాక్టర్ ను నల్లగొండ జిల్లా రసూల్ పురం( Rasul Puram ) రైతులు గుజరాత్ నుండి తెప్పించారు.దీనితో దుక్కి దున్నడం, కలుపు తీయటం, సాళ్లు పెట్టడం లాంటి పనులు చేసుకోవచ్చు.ఈ ట్రాక్టర్ తయారీకి దాదాపు రూ.60వేల రూపాయలు ఖర్చు అవుతుంది.జాదయ్య యాదవ్( Jadiah Yadav ) అనే వ్యక్తి ఈ వాహనాన్ని కొనుగోలు చేశాడు.ఈ వాహనం మెట్ట భూములను దున్నడానికి మాత్రమే పనిచేస్తుంది.ఒక లీటరు డీజిల్ తో ఎకరం పొలాన్ని ఒక గంట సమయంలో దున్నుకోవచ్చు.సాధారణంగా వేసవి నుంచి విత్తనాలు విత్తుకునే వరకు పొలాన్ని ఏకంగా ఏడుసార్లు దున్నుకోవాల్సి ఉంటుంది.ట్రాక్టర్ తో అయితే గంటకు రూ.1000 చొప్పున మొత్తం రూ.7000 ఖర్చు అవుతుంది.అదే ఈ బుల్లెట్ ట్రాక్టర్ తో రూ.700 ఖర్చు అవుతుంది.ఈ బుల్లెట్ ట్రాక్టర్ తో దుక్కి దున్నడం, పొలంలో విత్తనాలు వేయడం, జాకీ లిఫ్ట్, ఎరువులు వేయడం లాంటి పనులు తక్కువ సమయంలో చేయవచ్చు.