ప్రస్తుతం ఇండస్ట్రీ లో వస్తున్న మార్పులని బట్టి చూస్తుంటే తెలుగు సినిమా చాలా వరకు వరల్డ్ స్థాయి లో భారీ గా దూసుకుపోతుంది… ప్రస్తుతం అన్ని భాషలకు సంబంధించిన సినిమాలను ఆదరిస్తున్నారు.కంటెంట్ ఉంటే భాషతో సంబంధం లేకుండా సినిమాను హిట్టు చేస్తున్నారు.
అందుకు తగ్గట్టుగానే ఇప్పుడు సెలబ్రిటీల పిల్లలు కూడా సినిమాలలోకి ఎంట్రీ ఇవ్వాలని తమ టాలెంట్ ను నిరూపించుకోవాలని తెగ ఆరాటపడుతున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలోనే చైల్డ్ ఆర్టిస్టుగా కూడా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి హీరోయిన్ ,హీరోల రేంజ్ లో తమ నటనను కనబరిచి అందరి చేత ప్రశంసలు పొందుతున్నారు.
ఈ క్రమంలోనే టాలీవుడ్ ను భవిష్యత్తులో ఏలే సెలబ్రిటీ స్టార్ కిడ్స్ ఎవరెవరు అన్నది ఇప్పుడు చూద్దాం.
అల్లు అర్హ…అల్లు అర్జున్( Allu Arjun ) కూతురు అల్లు అర్హ శాకుంతలం సినిమాతో మొదటిసారి సినీ రంగ ప్రవేశం చేసింది.
ఈ సినిమాతో తన నటనతో మంచి మార్కులు వేయించుకున్న ఈ చిన్నారి ఇప్పుడు ఎన్టీఆర్ దేవర సినిమాలో కూడా నటిస్తోంది.ఇక ఖచ్చితంగా ఈ పాప హీరోయిన్ అవుతుందని అందరూ ముందే జ్యోతిష్యం చెప్పేస్తున్నారు.
సితార… సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టకపోయినా ప్రముఖ పీఎంజే బ్రాండ్ జ్యువెలరీకి( PMJ Brand Jewellery ) బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించి న్యూయార్క్ టైమ్ స్క్వేర్ లో ప్రదర్శించబడి రికార్డు సృష్టించింది.ఇక ఇప్పుడు మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ఎస్ఎస్ఎంబి 29 సినిమాలో అవకాశం దక్కించుకుంది.ఇప్పటికే సర్కారు వారి పాట సినిమాలో పెన్నీ పాటలో అలరించిన విషయం తెలిసిందే.
మోక్షజ్ఞ,అఖీరా నందన్… పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొడుకు అకీరా నందన్, నటసింహ బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ ఇద్దరూ కూడా సినిమా ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు.ఇక త్వరలోనే వీరిద్దరి సినీ ప్రయాణం మొదలు కాబోతోందని చెప్పవచ్చు.
అభయ్ రామ్ , భార్గవ్ రామ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ వారసులిగా గుర్తింపు తెచ్చుకున్న వీరిద్దరిలో ఒకరు అభయ్ రామ్( Abhay Ram ) రాజమౌళి, మహేష్ బాబు సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడు.ఈ సినిమాలో సితార , అభయ్ రామ్ అక్క తమ్ముళ్లగా నటించబోతున్నట్లు సమాచారం.మొత్తానికి అయితే వీరంతా కూడా ఇండస్ట్రీని భవిష్యత్తులో ఏలడానికి సిద్ధమవుతున్నారని చెప్పవచ్చు .
ఇలా ఇండస్ట్రీ లో చాలా మంది హీరో లా కొడుకులు ఎంట్రీ ఇచ్చి మంచి సక్సెస్ అందుకుంటున్నారు…
.