ఎన్నారై ఉద్యోగికి రాయల్ మెయిల్ నుంచి రూ.24 కోట్ల పరిహారం..!

యూకేలోని రాయల్ మెయిల్‌ కంపెనీ మాజీ ఉద్యోగిని అయిన కమ్ ఝూతి( Come Jhuti ) భారీ ఎత్తున పరిహారం అందుకుంది.భారతీయ సంతతికి చెందిన ఈమె గతంలో తన సహోద్యోగికి అన్యాయంగా బోనస్ అందుతుందని తన యజమానికి ఫిర్యాదు చేసింది.

 24 Crore Compensation From Royal Mail To Nri Employee, Royal Mail, Kam Jhuti, Bu-TeluguStop.com

దాని తర్వాత సదరు యజమాని తనను వేధించాడని ఆమె ఆరోపించింది.ఇదే విషయమై దాదాపు ఎనిమిదేళ్ల క్రితం ఎంప్లాయ్‌మెంట్ ట్రిబ్యునల్‌ను( Employment Tribunal ) ఆశ్రయించింది.

ట్రిబ్యునల్ ఇటీవల ఆమెకు అనుకూలంగా తీర్పునిచ్చింది.ఆమె బెదిరింపు వాదనను సమర్థించింది.

Telugu Appeal, Bonuses, Tribunal, Kam Jhuti, Nri, Royal Mail-Telugu NRI

తీర్పు ఫలితంగా, బ్రిటీష్ ఇండియన్ కమ్ ఝూతికి 2.3 మిలియన్ పౌండ్ల (దాదాపు రూ.24 కోట్ల) కంటే ఎక్కువ పరిహారం లభించింది.అయితే, రాయల్ మెయిల్ ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా అప్పీల్ చేసింది, కాబట్టి పూర్తి మొత్తం చెల్లింపు ప్రస్తుతానికి ఆపారు.14 రోజుల్లోగా ఆమెకు 250,000 పౌండ్లు చెల్లించేందుకు కంపెనీ యాజమానులు అంగీకరించారు.కమ్ ఝూతి బాస్‌ ప్రవర్తించిన తీరు వల్ల మానసికంగా ఎంతో కృంగిపోయిందని.

ఇదొక ఎమోషనల్ డిజాస్టర్ అని ధర్మాసనం అభివర్ణించింది.ఈ కేసు సందర్భంగా రాయల్ మెయిల్( Royal Mail ) వ్యవహరించిన తీరు దురుద్దేశపూర్వకంగా, అవమానకరంగా, అణచివేతలా ఉందని ధర్మాసనం విమర్శించింది.

Telugu Appeal, Bonuses, Tribunal, Kam Jhuti, Nri, Royal Mail-Telugu NRI

ఎన్నారై మహిళ 2013లో రాయల్ మెయిల్‌లో పని చేయడం ప్రారంభించింది.బోనస్‌లకు సంబంధించి కంపెనీ విధానాలను అనుసరించని సహోద్యోగిపై ఆమెకు అనుమానం వచ్చింది.దాంతో తన ఆందోళనలను నివేదించింది.చివరికి పరిస్థితి కారణంగా ఒత్తిడి, ఆందోళనను అనుభవించింది.ఆమె పని చివరికి తప్పుకుంది.2015లో ఆమె రాయల్ మెయిల్‌ను ఎంప్లాయ్‌మెంట్ ట్రిబ్యునల్‌కు తీసుకువెళ్లింది.అనేక చట్టపరమైన చర్యల తర్వాత, సుప్రీంకోర్టు ఆమెకు అనుకూలంగా తీర్పునిచ్చింది.అయితే, రాయల్ మెయిల్ ఈ నిర్ణయాన్ని అప్పీల్ చేసింది.అప్పీల్ పరిష్కరించే వరకు, 250,000 పౌండ్ల చెల్లింపు మాత్రమే కంపెనీ చేస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube