టిడిపి అధినేత చంద్రబాబు( Chandrababu Naidu ) పొత్తుల విషయంలో ఎటూ తేల్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు.2019 ఎన్నికల్లో టిడిపి( TDP ) ఒంటరిగా పోటీ చేయడంతో కేవలం 23 స్థానాలకే పరిమితం కావాల్సి వచ్చింది.2024 ఎన్నికల తరహా ఫలితాలు రిపీట్ కాకుండా చూసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.పార్టీని అధికారంలోకి తీసుకురావాలంటే కచ్చితంగా పొత్తులతో ముందుకు వెళ్లాలని, లేకపోతే బలమైన వైసీపీని ఢీకొట్టడం సాధ్యం కాదనే నిర్ణయానికి వచ్చారు.
అందుకే 2019 ఎన్నికల ఫలితాలు తర్వాత నుంచి బిజెపి( BJP )తో పొత్తు కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.అయినా బీజేపీ అగ్ర నేతలు చంద్రబాబుకు అపాయింట్మెంట్ సైతం ఇవ్వకుండా దూరం పెడుతూనే వస్తున్నారు.
ఇటీవల కేంద్ర హోం మంత్రి అమిత్ షా ను కలిసిన చంద్రబాబు పొత్తుల అంశాన్ని ప్రస్తావించగా, సానుకూలంగానే స్పందించారు.దీంతో 2024 ఎన్నికల్లో టిడిపి, బిజెపి ,జనసేన కలిసి పోటీ చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
పొత్తులో భాగంగా బిజెపి దాదాపు పది ఎంపి స్థానాలను కోరుతుండడంతో, ఆ సీట్లను ఇచ్చేందుకు చంద్రబాబు తప్పనిసరి పరిస్థితుల్లో అంగీకరించాల్సిన పరిస్థితి ఏర్పడింది.ఇదిలా ఉంటే బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల లాభం ఎంతుందో అంతకంటే ఎక్కువ నష్టం ఉందనే విషయాన్ని బాబు గుర్తించారు.అందుకే ఆ పార్టీతో పొత్తు పెట్టుకోవాలా వద్దా అనే విషయంలో ఇంకా తర్జన భర్జన పడుతున్నారు.బిజెపితో పొత్తు పెట్టుకుంటే మైనార్టీ వర్గాలతో పాటు , ఎస్సీ, ఎస్టీలు దూరమవుతారు.
చాలా వర్గాలు వైసీపీకి అనుకూలంగా మారుతాయని అంచనా వేస్తున్నారు.ఒక సర్వే లెక్కల ప్రకారం మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ ఓటర్లలో దాదాపు 30% మంది టీడీపీకి మద్దతు ఇస్తున్నారు.
వారు వైసిపి విషయంలో అంత ఆసక్తిగా లేరు. జనసేన తో టిడిపి పొత్తు పెట్టుకుని , వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తే వైసిపికి సవాల్ గా మారుతుందని టిడిపి నిర్వహించిన సర్వేల్లో తేలింది .కానీ బిజెపి కూటమి లో చేరితే మూడు నుంచి నాలుగు శాతం ఓట్లు కోల్పోయే అవకాశం ఉందని, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బిజెపితో పొత్తు పెట్టుకోవడం వల్ల కలిగే నష్టాలు ఎక్కువగా ఉంటాయని , అలాగే పొత్తును తిరస్కరించడం వల్ల జరిగే ప్రమాదము ఎక్కువగా ఉంటుందని టిడిపి ఆందోళన చెందుతోంది.ఈ విషయంలోనే చంద్రబాబు ఎటు తేల్చుకోలేకపోతున్నారు.