దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అగ్రతారగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి నయనతార ( Nayanatara) ప్రస్తుతం తన వృత్తిపరమైన వ్యక్తిగత జీవితంలో కూడా ఎంతో సంతోషంగా గడుపుతున్నారు.గత ఏడాది ఈమె డైరెక్టర్ విగ్నేష్ శివన్ ( Vignesh Shiva n) ను ప్రేమించి ఎంతో ఘనంగా పెళ్లి చేసుకున్న విషయం మనకు తెలిసిందే.
అయితే నేటికీ సరిగ్గా వీరి వివాహం జరిగి ఏడాది పూర్తి అయింది.దీంతో డైరెక్టర్ విగ్నేష్ సోషల్ మీడియా వేదికగా నయనతార గురించి ఎమోషనల్ పోస్ట్ చేశారు.
ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఇక వీరి వివాహం జరిగి ఏడాది పూర్తి కావడంతో తన పిల్లల ఫోటోలను కూడా ఈ సందర్భంగా రివీల్ చేశారు.తన ఇద్దరు పిల్లలను నయనతార ఎంతో ప్రేమగా ఆప్యాయతగా ఎత్తుకొని ఉన్నటువంటి ఫోటోలను ఈయన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ నయనతారకు మొదటి పెళ్లిరోజు( First Wedding Anniversary ) శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఈయన ఇన్స్టాగ్రామ్ వేదికగా స్పందిస్తూ నువ్వు నా జీవితంలోకి వచ్చి అప్పుడే ఏడాది పూర్తి అయింది.
ఈ సంవత్సర కాలంలో ఎన్నో సమస్యలను కలిసి ఎదుర్కొన్నాం.
నా పనిలో భాగంగా ఎన్నో చికాకులు ఎదుర్కొని ఇంటికి వచ్చిన నిన్ను పిల్లలను చూడగానే అని మర్చిపోతాను.కుటుంబం ఇచ్చే బలం ఎవరు ఇవ్వలేరు.మన పిల్లలకు మంచి జీవితాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను అంటూ ఈయన భావోద్వేగానికి గురయ్యారు.
ఈ విధంగా పెళ్లిరోజు సందర్భంగా విగ్నేష్ సోషల్ మీడియా( Social media ) వేదికగా చేసిన ఈ పోస్ట్ వైరల్ గా మారడంతో ఎంతో మంది అభిమానులు ఈ దంపతులకు మొదటి పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.ఇక జూన్ నెలలో వివాహం చేసుకున్నటువంటి ఈ దంపతులు అక్టోబర్ నెలలో హత్య గర్వం ద్వారా ఇద్దరు కవల పిల్లలకు తల్లిదండ్రులుగా మారిన విషయం మనకు తెలిసిందే.