పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్( Pan Indian star Prabhas ) తన తోటి హీరోలకు సరికొత్త పాఠాలు చెబుతున్నాడు.ఆ హీరోలు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో విఫలం అయ్యారు.
దీంతో ప్రభాస్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవడమే కాదు తోటి హీరోలు కూడా అలా నిలబెట్టుకోవాలని కొత్త పాఠాలు నేర్పిస్తున్నాడు.ఇంతకి అసలు విషయం ఏంటంటే.
”ఇకపై ఏడాది రెండు సినిమాలు చేస్తాం”( From now on we will make two films a year ) ఈ మాట మన టాలీవుడ్ లో చాలా మంది స్టార్ హీరోల నోటా విన్నాం.మహేష్ బాబు, రామ్ చరణ్, అల్లు అర్జున్.
వీరంతా ఫ్యాన్స్ కు ఇదే వాగ్దానం చేసారు.కానీ నిలబెట్టుకుంది ఎవరు.
వీరిలో ఏ హీరో కూడా చెప్పిన మాటను నిలబెట్టుకోలేక పోయారు.అయితే ఇందులో పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ మాత్రం చెప్పిన మాట చేసి చూపించారు.
ఈయన కూడా ఒకానొక సందర్భంగా ఏడాదికి రెండు సినిమాలు చేస్తానని మాట ఇచ్చాడు.అదే మాటను ఈయన ఫాలో అవుతున్నాడు.ఈ ఏడాది ఆదిపురుష్, సలార్ సినిమాలను( Adipurush, Salar movie ) రిలీజ్ చేయనున్నాడు.ఇక 2024కు కూడా అప్పుడే సెట్ చేసి పెట్టుకున్నాడు.ప్రాజెక్ట్ కే తో పాటు మారుతి సినిమా కూడా రిలీజ్ కానున్నాయి.ఇక 2025లో కూడా స్పిరిట్ సినిమాను అనౌన్స్ చేసి పెట్టుకున్నాడు.
ఇలా ఈయన ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే మిగతా హీరోలు మాత్రం సూపర్ హిట్స్ అందుకుని కూడా నెలలు నెలలు విరామం ఇచ్చుకుంటూ వస్తున్నారు.వారి ఫ్యాన్స్ ను మరింత వెయిట్ చేసేలా చేస్తున్నారు.
ఇప్పుడు ఇదే విషయాన్నీ సోషల్ మీడియాలో ప్రేక్షకులు చాలా ఇంట్రెస్టింగ్ గా చర్చించు కుంటున్నారు.
ప్రభాస్ మిగతా హీరోల్లో కాకుండా ఇచ్చిన మాటలను చేతలతో చేసి చూపిస్తున్నాడు అని ఏడాదికి రెండు సినిమాలు చేసి ఇండస్ట్రీని కూడా కాపాడాలి అని ఫ్యాన్స్ మధ్య చాలా ఆసక్తికర సంభాషణ సాగుతుంది.మరి మన హీరోలు కూడా స్పీడ్ పెంచేసి తమ ఫ్యాన్స్ కు మరింత ఖుషీ ఇస్తారో లేదో వేచి చూడాలి.