ఎన్టీఆర్ విగ్రహం( Sr Ntr Statue ) ఇష్యూలో కరాటే కళ్యాణి( Karate Kalyani ) తీరును తప్పుబడుతూ మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్( Maa Assosiation ) కఠిన నిర్ణయం తీసుకున్న విషయం తెల్సిందే.మా సభ్యత్వం విషయంలో కరాటే కళ్యాణి పై కఠిన చర్యలు తీసుకోవడం జరిగింది.
మా నుండి ఆమెను సస్పెండ్ చేయడం ను కొందరు సమర్థిస్తూ ఉంటే మరి కొందరు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు.తెలుగు సినిమా ఖ్యాతిని పెంచిన గొప్ప నటుడు ఎన్టీఆర్.
ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు చేస్తున్న ప్రయత్నంను కరాటే కళ్యాణి అడ్డుకోవడంతో పాటు ఎన్టీఆర్ గురించి అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను ఆమెను మా నుండి సస్పెండ్ చేయడం జరిగింది.గత కొంత కాలంగా కరాటే కళ్యాణి సినిమాల్లో పెద్దగా కనిపించడం లేదు.
ఆమెకు ఆఫర్లు కూడా రావడం లేదు.కనుక సస్పెండ్ చేసినంత మాత్రాన పెద్దగా ప్రభావం ఏమీ ఉండదు అన్నట్లుగా అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
కరాటే కళ్యాణి విషయంలో నందమూరి అభిమానులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఆమెను మా నుండి సస్పెండ్ చేయడం కాదు మొత్తం సినిమా ఇండస్ట్రీ నుండి బహిష్కరించాలి అంటూ డిమాండ్ చేస్తోంది.ఎన్టీఆర్ విగ్రహంను కృష్ణుడి రూపంలో ఏర్పాటు చేయడంను ఆమె అస్సలు ఒప్పుకోవడం లేదు.పైగా కోర్టుకు కూడా వెళ్లింది.
యాదవ హక్కుల సంరక్షణ పేరుతో కరాటే కళ్యాణి చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు.గతంలో కూడా కరాటే కళ్యాణి పై కొందరు విమర్శలు చేశారు.
ఇప్పుడు మళ్లీ అదే తరహా లో ఆమె విమర్శలు ఎదుర్కొంటుంది.ఎప్పుడు ఏదో ఒక వివాదంలో ఈమె ఉండటంను కొందరు తప్పుబడుతున్నారు.
పబ్లిసిటీ కోసం ఈమె చేస్తున్న హడావుడి మామూలుగా లేదు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.కరాటే కళ్యాణి యొక్క భవిష్యత్తు ఏంటి అనే విషయమై ఆమె త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి.
త్వరలో ఏదో ఒక రాజకీయ పార్టీలో ఆమె చేరే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు.