సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లు కేవలం గ్లామర్ పాత్రల్లోనే మాత్రమే కాకుండా లేడీ ఓరియెంటెడ్ సినిమాలో( Lady Oriented Movies ) నటించిన విషయం తెలిసిందే.మరి లేడి ఓరియెంటెడ్ సినిమాలతో నటించి మెప్పించిన ఆ హీరోయిన్ లు ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
అరుంధతి సినిమా నుంచి యశోద సినిమా వరకు అనుష్క, సమంత వంటి హీరోయిన్ లు లేడీ ఓరియెంటెడ్ సినిమాలలో నటించి మెప్పించారు.ఆ వివరాల్లోకి వెళితే.
అరుంధతి సినిమాలో అనుష్క ( Anushka ) నటించిన విషయం తెలిసిందే.ఈ సినిమా విడుదల అయ్యి ఎంతటి విజయాన్ని సాధించిందో మనందరికీ తెలిసిందే.పోరాటంలో తన ప్రాణాలను అడ్డుపెట్టి మరీ విజయం సాధిస్తుంది అనుష్క.అయితే ఈ సినిమాలో చాలా వరకు మూఢ విశ్వాసం ఉన్నప్పటికీ ఒక మహిళా తిరుగుబాటు, పోరాట పటిమ అనే అంశం ఎంతో మంది ఆడవాళ్లని ఇన్‌స్పైర్ చేస్తుందని చెప్పవచ్చు.
ఈ సినిమాతో భారీగా పాపులారిటిని ఏర్పరచుకుంది అనుష్క.ఆ తర్వాత అనుష్క రుద్రమదేవి భాగమతి సైలెంట్ లాంటి సినిమాలలో కూడా నటించి మెప్పించింది.
సమంత ( Samantha ) యశోద సినిమాతో ప్రేక్షకులను గత ఏడాద ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.

మెడికల్ మాఫియా నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం మహిళా సాధికారత అనే అంశానికి సరైన అర్థాన్ని చెప్పింది.ఇందులో సమంత అద్భుతంగా నటించింది.అలాగే హీరోయిన్ కీర్తి సురేష్ మహానటి తో భారీగా పేరుని సంపాదించుకుంది.
మహానటి అనే లేడీ ఓరియంటెడ్ సినిమాలో నటించింది కీర్తి సురేష్.అలనాటి మేటి నటి సావిత్రి జీవితం ఆధారణంగా ఈ బయోపిక్ రూపొందిన విషయం తెలిసిందే.ఇందులో సావిత్రి స్టార్ హీరోలను మించిన స్థాయికి ఎదగడం, ఆ తర్వాత ప్రేమ పేరులో మోసానికి గురికావడం,

తర్వాత తన జీవితాన్నే నాశనం చేసుకోవడం ఇందులో కన్‌క్లూజన్.లేడీ సూపర్ స్టార్ నయనతార డోరా, కో కో కోకిల,వసంతకాలం,అమ్మోరు తల్లి,ఓ2మయూరి వంటి సినిమాలలో నటించి మెప్పించింది.సాయిపల్లవి నటించే సినిమాల్లో కచ్చితంగా మహిళా సాధికారత అనే అంశం ఉండి తీరాల్సిందే.లేదంటే ఆమె నటించదు.హీరో సరసన చేసినా ఆమె పాత్ర బలంగా ఉండాల్సిందే.ఇక తనే మెయిన్ లీడ్‌గా చేసి మెప్పించిన చిత్రం గార్గి ఉమెన్ ఎంపావర్‌మెంట్‌కి, మహిళా శక్తికి నిదర్శనంగా నిలుస్తుంది.
కోలీవుడ్‌లో ఐశ్వర్య రాజేష్ సైతం లేడీ ఓరియంటెడ్ సినిమాలలో నటించి మెపపించింది.