బుట్టబొమ్మ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమై తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న అనిఖా సురేంద్రన్( Anikha Surendran ) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.ఈ నటికి సోషల్ మీడియాలో కూడా భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.2007 సంవత్సరంలో బాల నటిగా కెరీర్ ను మొదలుపెట్టిన ఈ నటి వరుస సినిమాలతో కెరీర్ పరంగా బిజీగా ఉన్నారనే సంగతి తెలిసిందే.సౌత్ ఇండియాలోని అన్ని భాషల్లో అనిఖాకు మంచి గుర్తింపు ఉంది.
ఎంతవాడు గానీ, విశ్వాసం సినిమాలలో అజిత్( Ajith ) కూతురి పాత్రలో అనిఖా సురేంద్రన్ మెప్పించడం గమనార్హం.అయితే అనిఖా సురేంద్రన్ మరణించిందంటూ తమిళనాడు( Tamil Nadu ) రాష్ట్రంలో కొన్ని పోస్టర్లు వైరల్ అయ్యాయి.
ఈ పోస్టర్లను చూసిన కొంతమంది అభిమానులు తెగ టెన్షన్ పడ్డారు.అయితే ఆ తర్వాత అసలు నిజం తెలిసి కూల్ అయ్యారు.

ఒక సినిమా షూటింగ్ లో భాగంగా ఆమె చనిపోయినట్టు పోస్టర్లు వేశారని సమాచారం.అనిఖా సురేంద్రన్ అజిత్ రీల్ కూతురు కాగా అనిఖ తర్వాత ప్రాజెక్ట్ లతో సక్సెస్ లను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.అనిఖా సురేంద్రన్ రెమ్యునరేషన్ కూడా భారీ రేంజ్ లోనే ఉందని తెలుస్తోంది.అనిఖా సురేంద్రన్ పోస్టర్ల వెనుక నిజం తెలిసి అభిమానులు సైతం కూల్ అవుతున్నారు.

అనిఖా సురేంద్రన్ సోషల్ మీడియాలో సైతం యాక్టివ్ గా ఉంటున్నారు.గ్లామర్ రోల్స్ లో, రొమాంటిక్ సీన్స్ లో నటించడానికి సైతం అనిఖా సురేంద్రన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు.అనిఖా సురేంద్రన్ కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలని స్టార్ హీరోయిన్ స్టేటస్ ను అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.అనిఖా సురేంద్రన్ నటిగా రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలను సొంతం చేసుకుని అంచనాలకు మించి కెరీర్ పరంగా ఎదుగుతారేమో చూడాల్సి ఉంది.