శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం పునర్నిర్మాణానికి 2 కోట్ల నిధులు మంజూరు

శ్రీ వేణుగోపాల స్వామి ఆలయానికి రెండు కోట్ల నిధులు మంజూరు చేసినందుకు మంత్రి కేటీఆర్ కు ధన్యవాదాలు తెలిపిన గ్రామస్తులురాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని పురాతన శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం నిర్మాణానికి 2 కోట్ల నిధులు దేవాదాయ శాఖ నుంచి రాష్ట్రమంత్రి కేటీఆర్ మంజూరు చేసినట్లు బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య గురువారం ప్రకటించారు.అతి త్వరలోనే కొబ్బరికాయ కొట్టి ఆలయ నిర్మాణం పనులను ప్రారంభిస్తామని పేర్కొన్నారు.

 2 Crores Sanctioned For The Reconstruction Of Sri Venugopala Swamy Temple-TeluguStop.com

కుల మతాలకు అతీతంగా మంత్రి కేటీఆర్ ఆలయాల నిర్మాణాల కొరకు కోట్లాది రూపాయలు మంజూరు చేస్తునట్లు వివిధ కుల సంఘాల భవనాలకు నిధులు మంజూరు చేసిన కేటీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు.గిఫ్ట్ ఏ స్మైల్ లో భాగంగా ట్యాబ్ ల పంపిణీకి ఇటీవల వచ్చిన సందర్భంగా మంత్రి కేటీఆర్ ఎల్లారెడ్డిపేట శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ నిర్మాణానికి రెండు కోట్ల నిధులు మంజూరు చేస్తానని ప్రకటించారు .

వందల ఏళ్ల సంవత్సరాల చరిత్ర ఉన్న ఆలయ పునర్నిర్మాణానికి బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, పట్టణ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి, సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి, సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి, వేణుగోపాల స్వామి ఆలయ కమిటీ అధ్యక్షులు నంది కిషన్, వైస్ చైర్మన్ ముత్యాల ప్రభాకర్ రెడ్డి తోపాటు మేగి నరసయ్య, బొమ్మ కంటి రవి, ఎంపీటీసీలు పందిర్ల నాగరాణి పరుశురాములు గౌడ్, ఎలగందుల అనసూయ నర్సింలు, ఉప సర్పంచ్ ఒగ్గు రజిత యాదవ్,మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్,వార్డు సభ్యులు, గ్రామంలోని వివిధ కుల సంఘాల నాయకులు అందరూ కలిసి పలుమార్లు మీటింగులు ఏర్పాటు చేసుకొని ఆలయ నిర్మాణానికి నిధులు ఇప్పించాలని మంత్రి కేటీఆర్ కు పలుమార్లు విజ్ఞప్తి చేశారు.కాగా ఎట్టకేలకు రెండు కోట్ల నిధులు మంజూరు చేసిన మంత్రి కేటీఆర్ కు ప్రజా ప్రతినిధులు, గ్రామస్తులందరూ ధన్యవాదాలు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube