ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండాలంటే బాడీని ఎప్పటికప్పుడు డిటాక్స్ చేసుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు.అలాగే అందంగా, కాంతివంతంగా కనిపించాలంటే చర్మాన్ని కూడా డిటాక్స్ చేసుకోవాలి.
ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే సింపుల్ అండ్ ఎఫెక్టివ్ రెమెడీని ట్రై చేస్తే మీ ముఖ చర్మం డిటాక్స్ అవ్వడమే కాదు గ్లోయింగ్‌గా, షైనీగా కూడా మారుతుంది.మరి ఇంకెందుకు ఆలస్యం ఈ రెమెడీ ఏంటో.
దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండీ.
ముందుగా ఒక ఆరెంజ్ పండును తీసుకుని వాటర్‌లో శుభ్రంగా కడిగి.
తొక్కలను వేరు చేయాలి.ఈ ఆరెంజ్ పండు తొక్కలను బ్లెండర్‌లో వేసుకుని, ఐదారు టేబుల్ స్పూన్ల రోజ్ వాటర్ ను యాడ్ చేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ పేస్ట్‌లో వన్ టేబుల్ స్పూన్ షుగర్ పౌడర్, వన్ టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్, వన్ టేబుల్ స్పూన్ తేనె, హఫ్ టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె వేసుకుని అన్నీ కలిసేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కాస్త మందంగా ముఖానికి అప్లై చేసి.ఇరవై నిమిషాల పాటు వదిలేయాలి.ఆపై పచ్చి పాలను ముఖంపై లైట్‌గా స్ప్రే చేసుకుని.
అప్పుడు నిమ్మ చెక్కతో మెల్ల మెల్లగా చర్మాన్ని రుద్దుకుంటూ వాటర్‌తో శుభ్రంగా ఫేస్ వాష్ చేసుకోవాలి.ఈ విధంగా చేయడం వల్ల చర్మంపై పేరుకుపోయిన దుమ్ము, ధూళి, మృత కణాలు, అదనపు జిడ్డు తొలగిపోయి డిటాక్స్ అవుతుంది.
దాంతో ముఖం గ్లోయింగ్‌గా మరియు షైనీగా మారుతుంది.అంతేకాదు, మూడు రోజులకు ఒకసారి ఈ సింపుల్ రెమెడీని ట్రై చేస్తూ ఉంటే పిగ్మెంటేషన్ సమస్యకు గుడ్ బై చెప్పొచ్చు.
మరియు స్కిన్ టోన్ సైతం ఇంప్రూవ్ అవుతుంది.కాబట్టి, తప్పకుండా ఈ రెమెడీని ప్రయత్నించండి.