కెనడాలో పెరుగుతోన్న గన్ కల్చర్, నరహత్యలు... ఆందోళన కలిగిస్తోన్న క్రైమ్ రిపోర్ట్..!!

ప్రపంచంలో ప్రశాంతంగా వుండే అతికొద్ది దేశాల్లో కెనడా కూడా ఒకటి.మెరుగైన జీవన ప్రమాణాలు, బలమైన ఆర్ధిక వ్యవస్థ, విస్తారమైన ఉపాధి అవకాశాల కారణంగా భారతీయులు సహా ఇతర దేశాలకు చెందిన వారు కెనడావైపు చూస్తున్నారు.

 Gun Violence, Homicides On The Rise In Canada: Report Gun Violence, Canada, Pro-TeluguStop.com

అయితే గత కొన్ని నెలలుగా కెనడాలో నేరాలు పెరుగుతున్నాయి.ఈ విషయాన్ని ఎన్నో సంస్థలు తెలియజేస్తున్నాయి.

ఈ మేరకు కెనడియన్ ప్రభుత్వ డేటా ఏజెన్సీ మంగళవారం కొత్త గణాంకాలను విడుదల చేశాయి.గన్ కల్చర్ కారణంగా దేశంలో వరుసగా ఏడో ఏడాది నేరాలు పెరిగాయని తెలిపింది.2020తో పోలిస్తే 2021లో తుపాకీ సంబంధిత నేరాలు 4 శాతం పెరిగాయని పేర్కొంది.

2020తో 39 శాతం నరహత్యలు తుపాకీతో జరగగా.2021లో అది 41 శాతానికి పెరిగింది.57 శాతం తుపాకీ సంబంధిత నరహత్యలలో … 57 శాతం తుపాకీతో , 26 శాతం రైఫిల్ లేదా షాట్ గన్‌తో జరిగినట్లు తెలిపింది.ఇకపోతే 2021లో 788 హత్యలను నివేదించారు.ఇవి గతేడాది కంటే 29 శాతం ఎక్కువ.2020లో ప్రతి 1,00,000 మంది జనాభాలో 2 నరహత్యలు జరగ్గా.2021లో ఇది 2.06కి పెరిగింది.బాధితుల్లో మూడింట ఒకవంతు (247) మందిని మైనారిటీలుగా గుర్తించారు.

దేశంలోని ప్రధాన ప్రావిన్సులైన అంటారియో, బ్రిటిష్ కొలంబియాలో హత్యలు పెరిగాయి.ఇటీవల బ్రిటీష్ కొలంబియాలో 48 ఏళ్ల ఇందర్ జిత్ సందు తన భార్య కమల్ జిత్ సంధును జూలై 28న అబాట్స్ ఫోర్డ్ పట్టణంలో హత్య చేశాడు.ఇక మరో కేసులో ముఠాలతో సంబంధాలు వున్న సతీందర్ గిల్, మెనిందర్ ధాలివాల్ లు జూలై 24న కాల్చి చంపబడ్డారు.26 ఏళ్ల ఇండో కెనడియన్ పర్దీప్ బ్రార్ జూలై 17న టొరంటోలోని నైట్ క్లబ్ లో కాల్చి చంపబడ్డాడు.గత నెలలో మెట్రో వాంకోవర్ ప్రాంతంలో హింసాత్మక తుపాకీ సంబంధిత నేరాలు జరిగాయి.

ఇక ఎన్ఆర్ఐ, 1985 కనిష్క విమాన ప్రమాదం కేసులో నిర్దోషిగా విడుదలైన రిపుదమన్ సింగ్ మాలిక్ హత్య కేసు భారత్ – కెనడాలలో కలకలం రేపిన సంగతి తెలిసిందే.

ఈ నెల 14న బ్రిటీష్ కొలంబియాలోని సర్రేలో మాలిక్‌ను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపిన సంగతి తెలిసిందే.ఆయన హత్యకు సంబంధించి వాంకోవర్‌కు తూర్పున 75 కిలోమీటర్ల దూరంలో వున్న బ్రిటీష్ కొలంబియాలోని అబోట్స్‌ఫోర్డ్‌కు చెందిన 21 ఏళ్ల టాన్నర్ ఫాక్స్, వాంకోవర్ శివారు న్యూ వెస్ట్‌మినిస్టర్‌కు చెందిన 23 ఏళ్ల జోస్ లోపెజ్‌లను అరెస్ట్ చేసినట్లు రాయల్ కెనడియన్ పోలీసులు తెలిపారు.

ఈ వరుస ఘటనలు కెనడా ప్రభుత్వాన్ని, పోలీస్ వర్గాలను ఉలిక్కిపడేలా చేశాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube