రాజన్న సిరిసిల్ల జిల్లా :విద్యార్థులు క్రమశిక్షణతో మెదులుతూ దేశభక్తి , మానవతా భావాలను పెంపొందించుకోవాలనీ, స్త్రీలను గౌరవించాలని, చక్కగా చదివి ఈ దేశానికి మంచి పేరుతేవాలనీ ,భావి భారత పౌరులుగా ఎదుగాలనీ రాజన్న సిరిసిల్ల జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఆకునూరి శంకరయ్య అన్నారు .బుధవారం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో(కో ఎడ్యుకేషన్) సిరిసిల్లలో నిత్య జాతీయ పతాకావిష్కరణ 150వ రోజు కార్యక్రమం”,అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో భాగంగా జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఆకునూరి శంకరయ్య ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకం ఆవిష్కరించారు.
ఈసందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టాలని, బాగా చదివి ఉన్నతంగా రాణించాలని మన భారత దేశంలోనే ఉద్యోగులుగా సేవచేయాలనీ,అలాగే విదేశాలకు వెళ్లిన పౌరులు ఇక్కడ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తున్నారని బాధాకరమన్నారు.అలాగే ప్రపంచంలోని స్త్రీ పురుషులంతా సమానమేననీ, ప్రతి ఒక్కరు గౌరవించుకోవాలనీ, మహిళలలను గౌరవించాలనీ కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపడం , నిత్య జాతీయ పతాకావిష్కరణ జరుగడం హర్షనీయమనీ , తనను కళాశాలకు ఆహ్వానించి గౌరవించినందులకు అభినందనలు తెల్పారు.
అనంతరం ప్రిన్సిపాల్ కనకశ్రీ విజయ రఘునందన్ మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో కష్టపడి,ఇష్టపడి చదివి మంచి మార్కులు సాధించివిద్యార్థులైన మీకు, కళాశాలకు,గురువులకు ,తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలని అన్నారు.అంతర్జాతీయ మహిళాదినోత్సవం సందర్భంగా మహిళా అధ్యాపకురాళ్లైన అరుందతి, జ్యోతి ల చేతులమీదుగా కేక్ కట్ చేయించారు.
మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ కనకశ్రీ విజయరఘునందన్, అధ్యాపకులు బుర్ర వెంకటేశంగౌడ్, ఇట్టినేని కనకయ్య, కచ్చు మేఘశ్యామ్, పెరుమాండ్ల రాజయ్య, నంబి అరుందతి, జంగిటి సురేష్, చెన్నోజ్వల శశిధర్, వాసరవేణి పర్శరాములు,దానవేని మహేందర్, అజ్మీర చంద్రశేఖర్, నీరటి విష్ణు ప్రసాద్, మల్లెవేణి రవీందర్, కోడం శ్రీనివాస్, బదనపురం జ్యోతి, నాగారపు మహేష్,సుల్తాన్ వెంకటేష్, నవీన్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.