టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ లలో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరు.ఈయన ఈ మధ్య కాలంలో వరుస హిట్స్ అందుకుంటూ దూసుకు పోతున్నాడు.
ఈయన ప్రజెంట్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేస్తున్నాడు.మహేష్, త్రివిక్రమ్ కాంబోలో SSMB28 సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.
ఈ సినిమాను హారిక హాసిని బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.
ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపు కుంటుంది.
ఈ సినిమాను అనుకున్న సమయానికి పూర్తి చేయడం కోసం త్రివిక్రమ్, మహేష్ రాత్రి పగలు కష్ట పడుతున్నాడు.అందుకే షెడ్యూల్స్ గ్యాప్ లేకుండా పూర్తి చేస్తున్నారు.ఇక ఈ సినిమాలో మహేష్ కు జోడీగా పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్ లుగా నటిస్తున్నారు.11 ఏళ్ల తర్వాత మహేష్ – త్రివిక్రమ్ కాంబో రిపీట్ అవుతుంది.
![Telugu Allu Arjun, Mahesh Babu, Nagavamshi, Ssmb, Trivikramallu-Movie Telugu Allu Arjun, Mahesh Babu, Nagavamshi, Ssmb, Trivikramallu-Movie](https://telugustop.com/wp-content/uploads/2023/02/Trivikram-again-with-hero-allu-arjun-after-Mahesh-movie-detailsa.jpg)
అందుకే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.పాన్ ఇండియా వ్యాప్తంగా రిలీజ్ కాబోతున్న ఈ సినిమాను ఆగస్టు 11న రిలీజ్ చేసేందుకు సిద్ధం అవుతున్నారు.ఇక ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ మరింత భారీ లైనప్ ను సెట్ చేసుకుంటున్నాడు.వరుసగా స్టార్ హీరోలను లైన్లో పెట్టుకుంటున్నాడు.ఇటీవలే నిర్మాత నాగవంశీ ఒక ఇంటర్వ్యూలో త్రివిక్రమ్ ఎన్టీఆర్ తో ఒక భారీ పౌరాణిక మూవీ చేసే ఆలోచనలో ఉన్నట్టు రివీల్ చేసారు.
![Telugu Allu Arjun, Mahesh Babu, Nagavamshi, Ssmb, Trivikramallu-Movie Telugu Allu Arjun, Mahesh Babu, Nagavamshi, Ssmb, Trivikramallu-Movie](https://telugustop.com/wp-content/uploads/2023/02/Trivikram-again-with-hero-allu-arjun-after-Mahesh-movie-detailss.jpg)
అయితే ఎన్టీఆర్ ప్రెజెంట్ లైనప్ పూర్తి అయ్యాకనే ఈ సినిమా ఉంటుందట.మరి ఈ లోపులోనే త్రివిక్రమ్ మరోసారి అల్లు అర్జున్ తో సినిమా చేయబోతున్నాడు అనే టాక్ వినిపిస్తుంది.వీరిద్దరి కాంబో సూపర్ హిట్ కాంబో.
మరి ఈ కాంబోలో మరో సినిమా వస్తుంది అని తెలియడంతో ఫ్యాన్స్ ఎగ్జైట్ గా ఎదురు చూస్తున్నారు.ఇక అల్లు అర్జున్ తో సినిమా తర్వాత అప్పుడు ఎన్టీఆర్ తో హారిక హాసిని బ్యానర్ లో భారీ స్థాయిలో పౌరాణిక మూవీ ఉంటుందట.