తూర్పుగోదావరి జిల్లాలో పండుగ వేళ విషాద ఘటన చోటు చేసుకుంది.నల్లజర్ల మండలం అనంతపల్లిలో కోడి కత్తి తగిలి ఓ వ్యక్తి మృతిచెందాడు.
పందాలు నిర్వహిస్తున్న బరుల వద్ద వీక్షిస్తున్న వ్యక్తిపై కోడి ఒక్కసారిగా ఎగిరి వచ్చింది.ఈ క్రమంలో కోడి కత్తి తగిలి వ్యక్తి కాలికి గాయమైంది.
తీవ్రంగా రక్తస్రావం కావడంతో బాధితుడిని హుటాహుటిన తాడేపల్లిగూడెం ఆస్పత్రికి తరలించారు.కాగా అప్పటికే సదరు వ్యక్తి మృతిచెందాడని వైద్యులు తెలిపారు.
మృతుడు అనంతపల్లికి చెందిన పద్మారావుగా గుర్తించారు.విషయం తెలుసుకున్న పందెం నిర్వాహకులు బరుల వద్ద నుంచి పరార్ అయ్యారు.
ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.