సాధారణంగా చాలామందికి ప్రజలకు హైదరాబాద్ దమ్ బిర్యాని అంటే ఎంతో ఇష్టమైన ఆహారం అని ఖచ్చితంగా చెప్పవచ్చు.ఒక్క రోజులోనే లక్ష ఆర్డర్లు దమ్ బిర్యాని కోసం వస్తూ ఉంటాయి.
ఇవే కాకుండా ఆఫ్లైన్ ఆర్డర్లు వండుకుని తినేవి వేరు ఎందుకంటే దమ్ బిర్యాని రుచిలోనే దాని దమ్ము ఉంటుంది.అలాగే కొంతమంది నరాల్లో రక్తానికి బదులుగా ఇరానీ చాయ్ ప్రవహిస్తూ ఉందని చెప్పడంలో అస్సలు సందేహం లేదు.
దమ్ బిర్యాని, చాయ్ లకు ఉండేటువంటి క్రేజ్ అంతా ఇంత కాదు.మరి మీరు ఎప్పుడైనా దమ్ చాయ్ రుచి చూశారా.
మీరు తాగాలనుకుంటే ఏ పదార్థాలు అవసరమవుతాయి.ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.ఈ కింద దమ్ టీ ఎలా చేయాలో తెలుసుకుందాం.ఈ సూచనలు పాటించడం ద్వారా మీరు తిని తయారు చేసుకునే అవకాశం ఉంటుంది.దమ్ టీ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు.రెండు కప్పుల పాలు, టీ పొడి ఒకటిన్నర టీ స్పూన్, తాజా అల్లం రెండు చిన్న ముక్కలు, నాలుగు లవంగాలు, రెండు యాలకులు, రెండు దాల్చిన చెక్క చిన్న ముక్కలు, నాలుగు నుంచి ఐదు తులసి ఆకులు రెండు స్పూన్ల పంచదార.
ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మొదటిగా ఒక చిన్న షీల్డ్ గ్లాస్ తీసుకొని దాని మూత పై శుభ్రమైన కాటన్ గుడ్డను గట్టిగా చుట్టాలి.ఇప్పుడు ఆ గుడ్డలపై టీ పొడి పంచదార వేసి ఆ తర్వాత మిగతా పదార్థాలను కూడా వేయాలి.ఇప్పుడు స్టవ్ మీద ఒక వెడల్పు లాంటి గిన్నెలో ఒక కప్పు నీళ్లు మరిగించాలి.
మరుగుతున్న నీటిలో సీల్డ్ గ్లాస్ ఉంచి మూత పెట్టాలి.కొన్ని నిమిషములు ఉడికించాలి.
అలా ఉడికించిన తర్వాత గిన్నెలో తయారయ్యే ఆవిరిలో షీల్డ్ గ్లాసులో చుక్కగా డికాషన్ ఫిల్టర్ అవుతూ ఉంటుంది.ఇప్పుడు ఒక కప్పు వేడి పాలలో ఈ ఫిల్టర్ అయినా డికాషన్ కలిపితే దమ్ చాయ్ తయారైపోతుంది.