అమెరికాలో దారుణం వరుసగా ఏడుగురిని చంపి.. ఆ తర్వాత..

అగ్రరాజ్యం అమెరికాలో దారుణం చోటుచేసుకుంది.ఇనిక్ రాష్ట్రానికి చెందిన మైఖేల్ హైట్ (42) తన కుటుంబం మొత్తాన్ని చంపి ఆ తర్వాత తను కూడా ప్రాణాలను తీసుకున్నాడు.

 Man Accused Of Killing Seven Members Of His Family In America Details, Killed Se-TeluguStop.com

బుధవారం ఇనిక్ నగరంలో జరిగిన ఈ దారుణం స్థానికంగా పెద్ద కలకలమే రేపింది.కడుపున పుట్టిన ఐదుగురు బిడ్డలతో పాటు భార్య, అత్త వీరందరినీ తుపాకీతో కాల్చి ఆ తర్వాత అతను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

ఈ సంఘటన గురించి గురువారం రోజు రాత్రి పోలీసులు పత్రిక సమావేశంలో మాట్లాడారు.క్రిస్మస్ సమయంలోనే నిందితుడు భార్య అతడికి విడాకుల నోటీసు ఇచ్చినట్లు తెలిపారు.

అయితే ఈ దారుణానికి కారణం విడాకులేనా అన్నది ఇప్పుడు నిర్ధారణంచలేమని పోలీసులు వెల్లడించారు.

మృతులందరూ స్థానికులకు బాగా పరిచయస్తులు కావడంతో ఇనిక్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

కొన్ని రోజుల క్రితం కూడా ఆ కుటుంబంలో ఒక వివాదం దర్యాప్తు జరిపినట్లు పోలీసులకు వెల్లడించారు.అంతేకాకుండా నిందితుడికి అతడి భార్య డైవర్స్ నోటీసులు ఇచ్చిన విషయం కూడా తమకు తెలుసని స్థానికులు చెబుతున్నారు.

దీని గురించి తప్ప బాధిత కుటుంబానికి సంబంధించి మరే ఇతర వివాదం ఇటీవల కాలంలో తమ దృష్టికి రాలేదని పోలీసులు చెబుతున్నారు.తమతో స్నేహంగా ఉంటున్న ఒక కుటుంబం ఇలా అకస్మాత్తుగా మరణించడంతో స్థానికంగా ఉన్న ప్రజలు కూడా ఎంతో బాధపడుతున్నారు.

నిందితుడి భార్య డిసెంబర్ 21న డైవర్స్ కు దరఖాస్తు చేసుకోగా 27న నోటీసులు అందాయి.అయితే భర్తతో ప్రమాదం పొంచి ఉండొచ్చున అనుమానాలు నిందితుడి భార్య ఎప్పుడూ వ్యక్తం చేయలేదని ఆమె పరిచయస్తులు కూడా చెబుతున్నారు.విడాకులకు గల కారణాలు ఏంటో కూడా ఇప్పటివరకు పోలీసులకు తెలియదు.రాష్ట్ర చట్టాల ప్రకారం డైవర్స్ కు గల కారణాలు ప్రజలకు బహిర్గతం చేయరు.ఇక ఘటనలో మృతి చెందిన చిన్నారులు నాలుగు నుంచి 17 సంవత్సరాల వయసున్న వారిలో ఏడు సంవత్సరాల వయసున్న కవల పిల్లలు కూడా ఉన్నారని పోలీసులు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube