అమెరికాలో దారుణం వరుసగా ఏడుగురిని చంపి.. ఆ తర్వాత..
TeluguStop.com
అగ్రరాజ్యం అమెరికాలో దారుణం చోటుచేసుకుంది.ఇనిక్ రాష్ట్రానికి చెందిన మైఖేల్ హైట్ (42) తన కుటుంబం మొత్తాన్ని చంపి ఆ తర్వాత తను కూడా ప్రాణాలను తీసుకున్నాడు.
బుధవారం ఇనిక్ నగరంలో జరిగిన ఈ దారుణం స్థానికంగా పెద్ద కలకలమే రేపింది.
కడుపున పుట్టిన ఐదుగురు బిడ్డలతో పాటు భార్య, అత్త వీరందరినీ తుపాకీతో కాల్చి ఆ తర్వాత అతను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఈ సంఘటన గురించి గురువారం రోజు రాత్రి పోలీసులు పత్రిక సమావేశంలో మాట్లాడారు.
క్రిస్మస్ సమయంలోనే నిందితుడు భార్య అతడికి విడాకుల నోటీసు ఇచ్చినట్లు తెలిపారు.అయితే ఈ దారుణానికి కారణం విడాకులేనా అన్నది ఇప్పుడు నిర్ధారణంచలేమని పోలీసులు వెల్లడించారు.
మృతులందరూ స్థానికులకు బాగా పరిచయస్తులు కావడంతో ఇనిక్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి.
కొన్ని రోజుల క్రితం కూడా ఆ కుటుంబంలో ఒక వివాదం దర్యాప్తు జరిపినట్లు పోలీసులకు వెల్లడించారు.
అంతేకాకుండా నిందితుడికి అతడి భార్య డైవర్స్ నోటీసులు ఇచ్చిన విషయం కూడా తమకు తెలుసని స్థానికులు చెబుతున్నారు.
దీని గురించి తప్ప బాధిత కుటుంబానికి సంబంధించి మరే ఇతర వివాదం ఇటీవల కాలంలో తమ దృష్టికి రాలేదని పోలీసులు చెబుతున్నారు.
తమతో స్నేహంగా ఉంటున్న ఒక కుటుంబం ఇలా అకస్మాత్తుగా మరణించడంతో స్థానికంగా ఉన్న ప్రజలు కూడా ఎంతో బాధపడుతున్నారు.
"""/"/
నిందితుడి భార్య డిసెంబర్ 21న డైవర్స్ కు దరఖాస్తు చేసుకోగా 27న నోటీసులు అందాయి.
అయితే భర్తతో ప్రమాదం పొంచి ఉండొచ్చున అనుమానాలు నిందితుడి భార్య ఎప్పుడూ వ్యక్తం చేయలేదని ఆమె పరిచయస్తులు కూడా చెబుతున్నారు.
విడాకులకు గల కారణాలు ఏంటో కూడా ఇప్పటివరకు పోలీసులకు తెలియదు.రాష్ట్ర చట్టాల ప్రకారం డైవర్స్ కు గల కారణాలు ప్రజలకు బహిర్గతం చేయరు.
ఇక ఘటనలో మృతి చెందిన చిన్నారులు నాలుగు నుంచి 17 సంవత్సరాల వయసున్న వారిలో ఏడు సంవత్సరాల వయసున్న కవల పిల్లలు కూడా ఉన్నారని పోలీసులు చెబుతున్నారు.
మెగా157 భారీ రెమ్యూనరేషన్ అందుకోబోతున్న అనిల్ రావిపూడి…. ఎంతనో తెలుసా?